పురుషులకి ఓ కమిషన్ కావాలి అంటున్న భార్యా బాధితులు!

సమాజంలో మహిళలపై జరుగుతున్న ఘోరాలు, అత్యాచారాలు, వేధింపులపై పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి మహిళా కమిషన్ వున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే మహిళలు ఎ స్థాయిలో పురుషుల నుంచి వేధింపులకి గురవుతున్నారో, పురుషులు కూడా అదే స్థాయిలో మహిళల నుంచి వేధింపులకి గురవుతున్నారు.

కాలేజీ నుంచి ఇంట్లో పెళ్ళాం వరకు చాలా మంది మహిళలు మగవారి పట్ల చిన్న చూపుతో నిత్యం మానసిక వేదనకి గురి చేస్తూ వుంటారు.

భార్యలు, కాలేజీ లో ప్రియురాళ్ళ వేధింపులు, మోసం తట్టుకోలేక చాలా మంది మగవారు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో తాజాగా మహిళా కమిషన్ లానే పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద భార్య బాధితులు పురుష కళ్యాణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆందోళన చేసారు.

మహిళల రక్షణ కోసం వున్న చట్టాలని వారు అడ్డుపెట్టుకొని మగవారిపై తప్పుడు కేసులు పెట్టి వేదింపులకి గురిచేస్తున్నారని, అలాగే సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి తీసుకోస్తునారని ఈ భార్య బాధితులు ఆరోపిస్తూ పురుష కమిషన్ కావాలి అని డిమాండ్ చేసారు.

ఇదేంది భయ్యా.. కేవలం 10 మీటర్లు దూరం సైకిల్ తొక్కితే రూ. పదివేల బహుమతి.. కాకపోతే కండిషన్స్ అప్లై..