వివాహిత బలవన్మరణం

ఆరోగ్య సమస్యలపై భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య.

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిల్లలమర్రి గ్రామానికి చెందిన చెరుకుపల్లి సుమలత (29)అనే వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలికి భర్త చెరుకుపల్లి సైదులుతో ఆరోగ్య విషయంలో మనస్పర్థలు వచ్చి,జీవితం మీద విరక్తి కలిగి,తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుంది.

మృతురాలికి ఒక కూతురు,ఒక కొడుకు ఉన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

సుమలత తల్లి కదిరి నరసమ్మ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఆర్.సాయిరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.