నయన్-విఘ్నేష్ పెళ్లి వీడియో ఒప్పందం రద్దు చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. అలా చేయడంతో..

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.

అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల చేత పిలుపించుకుంటూ స్టార్ హీరోలకే పోటీగా నిలుస్తుంది.

ఇక ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి పీటలు కూడా ఎక్కిన విషయం విదితమే.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.

వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి విహహం జరుగగా.

"""/"/ ఈ వేడుకను సినిమాటిక్ రేంజ్ లో గౌతమ్ మీనన్ షూట్ చేసారు.

ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాలేదు.

నయన్, విఘ్నేష్ తో కొంత మంది ప్రముఖులు దిగిన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి.

మిగతా చాలా ఫుటేజ్ బయటకు రాలేదు.ఈ పెళ్లి వీడియోను మొత్తం ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం ఇప్పటికే తెలిసిందే.

"""/"/ అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు వీరి డీలింగ్ ను క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.

అందుకు కారణం కూడా నయన్ విఘ్నేష్ అనే తెలుస్తుంది.ఇటీవల వీరి వివాహం పూర్తీ అయ్యి నెల రోజులు అవుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.

ఇలా ఫోటోలు షేర్ చేయడం నెట్ ఫ్లిక్స్ నిభందనలకు విరుద్ధం అట.ఈ కారణంగానే వీరు ఈ భారీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నారట.

ఇది నిజమో కాదో తెలియాలంటే ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.

కేవలం ఈ మూడు ఉంటే చాలు పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుంది!