కాంగ్రెస్‎పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందన్న ఆయన నయం చేయలేని స్థితికి చేరిందన్నారు.ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదని చెప్పారు.

తనలాంటి హోంగార్డులు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతారని తెలిపారు.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వెల్లడించారు.

ఇంఛార్జ్ లతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశారని విమర్శించారు.ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించారని ఆరోపించారు.

3 వేల నుంచి 20 వేలకు ఓట్లు పెరిగాయని సంబరపడటం అవివేకమని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో 15 మందిని గెలిపించుకుని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దని వారించిన వారిలో తాను కూడా ఉన్నానని తెలిపారు.

తప్పని పరిస్థితుల్లో పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు.

ఇమ్యూనిటీని పెంచే టీ ఇది.. వింటర్ లో అస్సలు మిస్ అవ్వకండి!