మార్క్ జుకర్‌బర్గ్ గోల్డ్ చైన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
TeluguStop.com
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్( Meta CEO Mark Zuckerberg ) రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోల్లో తరచూ ఓ బంగారు గొలుసు( Gold Chain ) ధరించి కనిపిస్తున్నారు.
ఆ గొలుసు బాగా హైలైట్ అయింది.అది అందంగా ఉంది.
మార్క్ లుక్ ను బాగా పెంచేసింది.అతడు దీన్ని కొత్తగా ఎందుకు ధరించడం ప్రారంభించారా అని చాలామంది ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనే ఈ గొలుసు గురించి చెప్పారు.తన కూతుళ్ల కోసం తాను రోజూ పాడే ప్రార్థన( Prayer ) ఈ గోల్డెన్ చైన్ మీద చాలా చక్కగా రాసి ఉందని అన్నారు.
అందుకే, ఆ గొలుసు తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పారు.అలా ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆయనకు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది.
"""/" /
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసిన వీడియోలో, ఒక జర్నలిస్ట్ జుకర్‌బర్గ్‌ని ఉద్దేశిస్తూ గోల్డెన్ నెక్లెస్ గురించి చెప్పమని అడిగారు.
జుకర్‌బర్గ్ తన చైన్‌ని చూస్తూ "ఓహ్, ఇదేనా? నేను ఈ నెక్లెస్‌ని ఒక డిజైనర్‌తో కలిసి చేయించా.
దాని మీద ప్రతి రాత్రి పడుకునే సమయంలో నా కుమార్తెలకు( Daughters ) పాడే ప్రార్థన ఉంది.
ఇది మి షెబీరాచ్ అనే యూదు ప్రార్థన.ఆరోగ్యం, ధైర్యసాహసాల కోసం చేసే ప్రార్ధన.
'మన జీవితాలను బ్లెస్సింగ్‌గా మార్చుకోవడానికి మాకు ధైర్యం కలగాలి'.అని ఈ ప్రార్థనలో మనం అనుకుంటాం.
" అని చెప్పారు. """/" /
మార్క్ జుకర్‌బర్గ్ తన కుమార్తెలకు ప్రతి రాత్రి ఈ ప్రార్థన పాడుతుంటారు.
తన కుమార్తెలు పుట్టినప్పటి నుంచి ఇలా చేస్తున్నానని, ప్రయాణాల్లో లేకపోతే ప్రతి రాత్రి పాడుతుంటానని చెప్పారు.
తన కుమార్తెలతో గడుపుతున్న సమయంలో తనకు ఇది చాలా ముఖ్యమని, తన కుమార్తెలు, కుటుంబానికి ఇది చాలా అర్థవంతంగా ఉంటుందని అన్నారు.
అంతేకాకుండా, తన గొలుసును డిజైనర్ ఎలి హలిలి రూపొందించారని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
అక్కడ సోనూసూద్ కు 390 అడుగుల కటౌట్.. విద్యార్థులు అభిమానాన్ని చాటుకున్నారుగా!