తల్లి కాబోతున్న మాజీ టెన్నీస్ స్టార్..!

ఆమె ఆడటం మానేసి చాలా ఏళ్లయింది.కానీ ఆమె పట్ల ప్రపంచానికి ఉన్న అభిమానం మాత్రం తరగనిది.

ప్రపంచ మాజీ నంబర్‌వన్‌, రష్యా టెన్నిస్‌ బ్యూటీ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త తెలిపింది.

తన ఆటతోనే కాకుండా, అందంతో కూడా ప్రపంచ టెన్నిస్ ప్రియులను కట్టిపడేసిన టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా తల్లి కాబోతోంది.

ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది.ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

మరియా షరపోవా గర్భిణీ అనే విషయంతో పాటు తనబర్త్‌డే ఏప్రిల్ 19న అనే విషయాన్ని కూడా అభిమానులకు షేర్ చేసింది.

ఇప్పుడు షరపోవా వయస్సు 35 ఏళ్లు.బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసి.

అమూల్యమైన రోజులు ఆరంభమయ్యాయి.పుట్టిన రోజు కేకు ఇద్దరం తినడం నాకెప్పుడూ ప్రత్యేకం ’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

మరియా షరపోవా 2020లో టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికింది.తన కెరీర్ లో ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచింది.

మరియా షరపోవా 2020 డిసెంబర్ నెలలో బ్రిటీష్ మిలినియర్ అలెగ్జాండర్ గిల్క్స్ తో నిశ్చితార్ధం చేసుకుంది.

ఆయ‌న న్యూయార్క్‌లో బాగా కనెక్ట్ అయిన బ్రిటన్ దేశానికి చెందిన వ్య‌క్తిగా పేరుగాంచారు.

షరపోవా 2020లో ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి విర‌మ‌ణ తీసుకున్నారు. """/"/ షరపోవా తన కెరీర్‌లో రష్యన్ త‌రుఫున పోటీ చేశారు.

అయితే కెరీర్ గ్రాండ్ స్లామ్ గెలిచిన ఏకైక రష్యన్ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

షరపోవా యువ టెన్నిస్ ప్రాడిజీగా దేశానికి వచ్చినప్పటి నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నారు.

ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దానికి మించిన పాఠం మరొకటి ఉండదు.. రితికా సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!