మావోయిస్టులు కాంగ్రెస్‎కు మద్థతివ్వాలి..: మంత్రి తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem )లో నిర్వహించిన కాంగ్రెస్( కార్యకర్తల సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Thummala ) హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో మావోయిస్టులు బెదిరించినా మంత్రిగా ఏజెన్సీలో పర్యటించానని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

తమను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతరలు కూడా పేలలేదన్నారు.ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టే మందుపాతరలు పేలలేదని మావోయిస్టులు కూడా ప్రకటించారని తెలిపారు.

ప్రజలకు సేవ చేస్తూ చనిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే గిరిజనుల అభివృద్ధి కోసం పని చేసే కాంగ్రెస్( Congress ) ను గెలిపించాలని కోరారు.

అదేవిధంగా మావోయిస్టులు కూడా కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వాలని ఆకాంక్షించారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది…ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను: సాయి పల్లవి