ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు ఎదురుదెబ్బ...

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది.మావోయిస్టులు కంచుకోట అయిన క‌టాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా స‌బ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.

ఏవోబీలోని క‌టాఫ్ ఏరియాలోని చిత్ర‌కొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని రాళ్ల‌గెడ్డ పంచాయ‌తీ ప‌రిధిలో మావోయిస్టు సానుభూతిప‌రులు మల్కన్‌గిరి ఎస్పీ నితీష్ వాధ్వానీ, బీఎస్‌ఎఫ్ డీఐజీ ఎస్కే సిన్ ముందులొంగిపోయారు.

సోమ‌వారం జాన్‌బైలో బీఎస్ఎఫ్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మిలీషియా స‌బ్యులు లొంగుబాటు పోలీసులు చూపించారు.

క‌టాఫ్ ఏరియాలో అభివృద్ది ప‌నులు చూసి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి చేరాల‌నుకున్న‌ట్లు మావోయిస్టు సానుభూతిప‌రులు వెల్ల‌డించారు.

ఇటీవ‌ల క‌టాఫ్ ఏరియాలో లొంగిపోయిన కొంత‌మంది మావోయిస్టు మిలీషియా స‌బ్యులు త‌మ‌కు లొంగిపోయేలా ప్రోత్స‌హించార‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా మావోయిస్టు పార్టీ ఏక‌రూప‌దుస్తుల‌ను త‌గుల‌బెట్టి, మావోయిస్టుల‌కు వ్య‌తిరేఖంగా మిలీషియా స‌బ్యులు నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్బంగా లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా స‌బ్యుల‌కు క్రీడాసామాగ్రీని మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్‌పీ నితీష్ వాద్వానీ పంపిణీచేశారు.