ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టుల ఘాతుకం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.ఓ బీజేపీ నేతను దారుణంగా కాల్చి హత్య చేశారని తెలుస్తోంది.

బీజేపీ నాయకుడు బిర్జు తారామ్ ఇంటిలోకి ప్రవేశించిన మావోయిస్టులు ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఈ క్రమంలో బిర్జు తారామ్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు.రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో చోటు చేసుకున్న ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పార్టీలో కీలకంగా ఉన్న బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేయడంతో ఛత్తీస్ గఢ్ ఇతర బీజేపీ నేతలు సైతం భయానికి గురవుతున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కోసం రాని తారక్… ఎన్టీఆర్ రాకపోవడానికి అదే కారణమా?