వైద్యరంగంలో అనేక మార్పులు..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ శాసనమండలిలో వైద్యరంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఆస్పత్రుల్లో నియామకాలు జరుగుతున్నాయన్న మంత్రి హరీశ్ రావు 852 డాక్లర్ల పోస్టులను కూడా భర్తీ చేసినట్లు వెల్లడించారు.

అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని తెలిపారు.

దాంతోపాటు పల్లె, బస్తీ దవాఖానాల్లోనూ నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్లు కల్పించడంతో పాటు త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.

స్విట్జర్లాండ్‌లో గ్రాడ్యుయేషన్ డే .. లెహంగాలో వచ్చిన భారతీయ విద్యార్ధిని