ఈరోజు నుంచే ప్రారంభమైన రాఘవేంద్రుల గురు వైభవ ఉత్సవాలు..
TeluguStop.com
మన దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.
అలాంటి పుణ్యక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఒకటి.కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఈ రోజు నుంచి గురు భక్తి ఉత్సవాలు మొదలయ్యాయి.
ఈ ఉత్సవాలు శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి.
ఈ ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఉంచారు.
ఉత్సవాలలో భాగంగా మూల బృందావనానికి పంచామృతం అభిషేకాలు, విశేష పూజలను నిర్వహించారు. """/" /
402 వ పట్టాభిషేకం సందర్భంగా మతం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్ధులు స్వామి వారి పాదుకలకు నవరత్నాలు,పుష్పాలతో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 22వ తేదీన శ్రీ రాఘవేంద్ర స్వామి 402వ పట్టాభిషేక ఉత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.
గురు భక్తి ఉత్సవాలలో భాగంగా ఆఖరు రోజైన ఫిబ్రవరి 26వ తేదీన శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా, వైభవంగా నిర్వహించనున్నారు.
"""/" /
ఈ జన్మదినంలో భాగంగా టీటీడీ నుంచి అధికారికంగా రాఘవేంద్ర స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు ఈరోజు స్వామివారి ప్రతిమను స్వర్ణ రథోత్సవంలో ఊరేగించనున్నారు గురువు ఉత్సవాల కోసం మంత్రలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు వచ్చే అవకాశం ఉందని దేవాలయ అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా ఆరు రోజులపాటు జరిగే ఈ పుణ్య కార్యానికి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశామని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ‘ సినిమాను నిఖిల్ అనవసరం గా చేశాడా..?