Flood Rescue : వీడియో: వరదల నుంచి తల్లి బిడ్డను రక్షించిన వ్యక్తి.. రియల్ హీరో అంటూ..

బ్రెజిల్‌లో( Brazil ) ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.ఇదొక రెస్క్యూ ఆపరేషన్.

( Rescue Operation ) దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిగా ఇది ఆన్‌లైన్‌లో చాలా మంది హృదయాలను దోచుకుంది.

మార్కోస్ వినిసియస్( Marcos Vinicius ) అని అనే బ్రెజిలియన్ వ్యక్తి, అకస్మాత్తుగా వరదలో చిక్కుకున్న కారు నుంచి తల్లి, ఆమె బిడ్డను రక్షించాడు.

ఈ సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో వినిసియస్ వేగంగా పెరుగుతున్న వరదనీటిలో చిక్కుకున్న కారు వద్ద కనిపించాడు.

తన భద్రత గురించి ఆలోచించకుండా, ఏడుస్తున్న పిల్లవాడిని రక్షించడానికి అతను మొదట కారులోకి చేరుకున్నాడు.

"""/" / జాగ్రత్తగా ఆ చిన్నారిని పక్కనే ఉన్న వ్యక్తికి అప్పగించాడు.ఆపై, పిల్లల తల్లికి సహాయం చేయడానికి వెనక్కి తిరిగాడు.

గుండె ఆగిపోయే క్షణంలో తల్లి, బిడ్డను సురక్షితంగా బయటకు తీసుకు రాగలిగాడు మరుక్షణమే వరదనీరులో( Flood Water ) కారు కొట్టుకుపోయింది.

అతడు ఒక్క క్షణం ఆలస్యం చేసిన తల్లి కారుతో సహా వరదల్లో కొట్టుకుపోయి ఉండేది అదే జరిగితే ఆమె బిడ్డ అనాథగా మారుండేది కానీ వినిసియస్ వేగంగా స్పందించి వారిద్దరినీ త్వరగా బయటకు తీసుకురాగలిగాడు.

సింగిల్ గా అతడు ఈ పని చేయడం నిజంగా ప్రశంసనీయం. """/" / గుడ్‌న్యూస్_మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియో పోస్ట్ చేసింది.

అప్‌లోడ్ చేసినప్పటి నుంచి వీడియో వైరల్‌గా మారింది, దీనికి 8 లక్షల వ్యూస్, 40 వేల లైక్‌లు వచ్చాయి.

వినిసియస్ ధైర్య సాహసానికి ప్రజలు తమ విస్మయాన్ని, కృతజ్ఞతలు తెలియజేశారు.చాలా మంది అతన్ని హీరో అని పిలిచారు.

సమయానికి వ్యక్తులను రక్షించే సినిమాల్లోని నాటకీయ సన్నివేశాలను కూడా వారు గుర్తు చేసుకున్నారు.

ఈ రెస్క్యూ వినిసియస్ ధైర్యసాహసాలను మాత్రమే కాకుండా ఆకస్మిక వరదల అనూహ్య, ప్రమాదకరమైన స్వభావాన్ని కూడా హైలైట్ చేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 9, శనివారం2024