అమెరికాలో భారతీయురాలి చరిత్ర.. తొలి సిక్కు మహిళా జడ్జిగా ఘనత
TeluguStop.com
అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ చరిత్ర సృష్టించింది.మన్‌ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా నిలిచింది.వివరాల్లోకి వెళితే.
హ్యూస్టన్‌లో పుట్టి పెరిగిన మోనికా బెల్లయిరేలో నివసిస్తున్నారు.టెక్సాస్‌లోని లా నెంబర్ 4లో హారిస్ కౌంటీ సివిల్ కోర్ట్ న్యాయమూర్తిగా ఆమె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
మోనికా సింగ్ తండ్రి 1970ల ప్రారంభంలో అమెరికాకు వలస వచ్చారు.ఆమె 20 ఏళ్ల పాటు ట్రయల్ న్యాయవాదిగా పనిచేశారు.
"""/"/
ఇకపోతే కేరళకు చెందిన మహిళా అటార్నీ జూలి ఏ.మాథ్యూ ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
వరుసగా రెండోసారి ఆమె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.కేరళలోని తిరువల్లకు చెందిన మాథ్యూ.
కాసరగోడ్‌లోని భీమనడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టులో 3వ నెంబర్‌కు ప్రెసిడెంట్‌గా మాథ్యూ నాలుగేళ్లపాటు కొనసాగుతారు.
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జూలీ.ఈ పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఆండ్రూ డోర్న్‌బర్గ్‌ను 1,23,116 ఓట్ల భారీ తేడాతో ఓడించారు.
"""/"/
అటు భారత సంతతికి చెందిన సురేంద్రన్ కె పటేల్ కూడా ఇదే టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించారు.పూట గడవటం కోసం సురేంద్రన్ తన సోదరితో కలిసి బీడీలు చుట్టడానికి వెళ్లేవారు.
న్యాయవాద విద్యను పూర్తి చేసిన అనంతరం కాసర్‌గోడ్ జిల్లా హోజ్‌దుర్గ్ కోర్టులో జూనియర్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
తర్వాత ప్రఖ్యాత న్యాయవాది రాజీవ్ ధావన్ పరిచయంతో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.ఈ క్రమంలో శుభతో సురేంద్రన్‌కు వివాహం జరిగింది.
ఆపై వీరిద్దరూ అమెరికాకు వెళ్లారు.ఈ నేపథ్యంలో టెక్సాస్ బార్ ఎగ్జామ్ పాస్ అయిన సురేంద్రన్ 2011లో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.
న్యాయవాదిగా అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న ఆయనను ఇటీవలే టెక్సాస్ జిల్లా జడ్జి పదవి వరించింది.
దానిమ్మ తొక్కలతో ఇలా చేశారంటే మచ్చలేని చర్మం మీ సొంతం!