హనుమంతుని డైలాగ్స్ అందుకే అలా రాశా.. రచయిత సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఆదిపురుష్ ( Adipurush ) సినిమాలో హనుమంతుని పాత్ర( Hanuman ) చెప్పిన ఊరమాస్ డైలాగ్స్ కొంతమంది ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగిస్తుంటే మరి కొందరికి చిరాకు తెప్పిస్తున్నాయి.

బోయపాటి శ్రీను సినిమాలను తలపించేలా "నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది, దానికి రాసిన చమురు నీ బాబుది, నిప్పు కూడా నీ బాబుదే, కాబట్టి కాలేదీ నీ బాబుకే" అనే డైలాగ్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ మాస్ డైలాగ్ గురించి ఈ డైలాగ్ రాసిన మనోజ్ ముంతాషీర్( Manoj Munthsir ) మాట్లాడుతూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఆ విధంగా డైలాగ్స్ రాయడమే కరెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.

అమ్మమ్మ నాకు రామాయణం చెప్పిన విధంగానే నేను ఈ సినిమాలో డైలాగ్స్ రాయడం జరిగిందని మనోజ్ వెల్లడించడం గమనార్హం.

సరళమైన భాషలో రామాయణం తీయాలని ఈ డైలాగ్స్ రాశానని మనోజ్ చెప్పుకొచ్చారు. """/" / ఈ సినిమాలో మాస్ డైలాగ్స్ వెనుక అసలు కథ ఇదేనని ఆయన పేర్కొన్నారు.

నిశితంగా ఆలోచించి హనుమాన్ డైలాగ్స్ రాశానని మనోజ్ వెల్లడించారు.అందరూ ఒకేలా మాట్లాడరని పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి డైలాగ్స్ అలా రాశామని మనోజ్ పేర్కొన్నారు.

ఈ తరహా డైలాగ్స్ రాసిన మొదటి వ్యకిని నేను కాదని జానపద కళాకారులు రామాయణం డైలాగ్స్ ను ఇదే విధంగా చెప్పేవారని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / మనోజ్ సమర్థించుకున్న తీరుపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఆదిపురుష్ సినిమాపై ట్రోలింగ్ కొనసాగుస్తోంది.కమర్షియల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.

ఈ సినిమాకు 140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆదిపురుష్ నెగిటివ్ కామెంట్లపై రియాక్ట్ కావడానికి ఎవరూ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

ఇండస్ట్రీ కి తొలి నట వారసుడు, రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన నందమూరి వారసుడు..?