నాన్నను బ్రతికుండగానే కాటికి పొమ్మని కోరాను.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో మనోజ్ బాజ్ పాయ్( Manoj Bajpayee ) ఒకరు.

నాన్న మంచం మీద చివరి స్టేజ్ లో ఉన్న సమయంలో ఆయన అవస్థ చూడలేక చనిపోవాలని కోరానని మనోజ్ చెప్పుకొచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో మనోజ్ ఈ కామెంట్లు చేశారు.నా లైఫ్ లో అత్యంత విషాదకరమైన సంఘటన నాన్న మరణం అని మనోజ్ బాజ్ పాయ్ అన్నారు.

ఒకరోజు నా సోదరి ఫోన్ చేసి నాన్న జీవితం పూర్తైందని చెప్పిందని మనోజ్ వెల్లడించారు.

డాక్టర్లు మాత్రం ఆయన ఇంకా ఈ ప్రపంచంలోనే ఇరుక్కుపోయాడని చెప్పారని మనోజ్ అన్నారు.

నాకు, నాన్నకు మధ్య ఆప్యాయత ఉండేదని మనోజ్ వెల్లడించారు.అందుకని నన్నే నాన్నని విముక్తి చేయాలని చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఆ సమయంలో నేను కిల్లర్ సూప్ వెబ్ సిరీస్( Killer Soup Webseries ) సెట్స్ లో ఉన్నానని మనోజ్ వెల్లడించారు.

నా వ్యాన్ లో ఒక బాయ్ ముందే నాన్నతో ఫోన్ కాల్ మాట్లాడానని ఆయన తెలిపారు.

"""/" / నాన్న.( Manoj Bajpayee Father ) నొప్పి భరించింది చాలు ప్లీజ్ వెళ్లిపో అని అన్నానని మనోజ్ పేర్కొన్నారు.

అందరినీ వదిలి వెళ్లిపోయే సమయం వచ్చేసిందని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.అలా మాట్లాడినందుకు నా మనస్సు ఎంత కృంగిపోయిందో నాకు మాత్రమే తెలుసని మనోజ్ వెల్లడించారు.

నా మాటలు విని బాయ్ ఎంతో ఏడ్చేశాడని ఆయన అన్నారు.ఆ రోజులు ఎంత కష్టంగా గడిచాయో నాకు మాత్రమే తెలుసని మనోజ్ వెల్లడించారు.

"""/" / నేను అలా మాట్లాడిన తర్వాత రోజు తెల్లవారుజామున నాన్న మృతి చెందాడని మనోజ్ పేర్కొన్నారు.

నాన్న నన్ను చూడాలనే తన శరీరాన్ని వదిలి వెళ్లిపోలేదని మనోజ్ వెల్లడించారు.నాన్న చనిపోయారనే వార్త వినగానే కన్నీళ్లు ఆగలేదని ఆయన అన్నారు.

నాన్న చనిపోయిన మరుసటి ఏడాది అమ్మ చనిపోయిందని మనోజ్ కామెంట్లు చేయడం గమనార్హం.