మన్మధుడు 2 రివ్యూ అండ్ రేటింగ్

దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'మన్మధుడు' చిత్రంను ఇంకా కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు.

అలాంటి ముద్ర వేసిన నాగార్జున ఇప్పుడు మరోసారి అదే టైటిల్‌తో ప్రేక్షకు ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

అది కూడా అప్పటి చిత్రంకు పూర్తి విరుద్దమైన కథాంశంతో అవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

నాగార్జున గత చిత్రాలు ఫ్లాప్‌ అయినా కూడా ఈ చిత్రంకు మంచి బజ్‌ ఏర్పడింది.

ఈమద్య కాలంలో నాగార్జున ఏ సినిమాకు కాని ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఈ చిత్రంకు అయ్యింది.

రకుల్‌ బోల్డ్‌ పాత్రతో పాటు విభిన్నమైన నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది.మరి ఈ చిత్రం ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూసేద్దామా.

నటీనటులు : నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లక్ష్మి, వెన్నెల కిషోర్‌, నాజర్‌, రావు రమేష్‌, జాన్సి దర్శకత్వం : రాహుల్‌ రవీంద్రన్‌ నిర్మాణం : నాగార్జున సంగీతం : చైతన్‌ భరద్వాజ్‌ H3 Class=subheader-styleకథ :/h3p ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన సామ్‌(నాగార్జున) లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు.

పెళ్లి వయసు వచ్చి వెళ్లి పోయినా కూడా పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఒప్పుకోడు.

ఇంట్లో వారు సామ్‌ను బుద్ది మంతుడు, అమాయకుడు అనుకుంటారు.కాని సామ్‌ మాత్రం బయట మహా ముదురు.

అమ్మాయిలను పడేయడంలో మన్మధుడు.పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేని సామ్‌ జీవితంలోని అవంతిక(రకుల్‌ ప్రీత్‌సింగ్‌) ఎంటర్‌ అవుతుంది.

దాంతో అతడి జీవితంలో జరిగిన మార్పు ఏంటీ? సామ్‌కు పెళ్లి ఎందుకు ఇష్టం లేదు అనే విషయాన్ని సినిమా చూసి తెలుసుకోండి.

H3 Class=subheader-styleనటీనటుల నటన :/h3p నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు.

ఆయన ఎలాంటి పాత్రల్లో అయినా దున్నేస్తాడు.ఈ చిత్రంలోని ఆయన పాత్రలో మరోసారి పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించాడు.

ఈ వయసులో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించేందుకు కాస్త ఇబ్బంది పడతారు.కాని నాగార్జున మాత్రం అలా పడ్డట్లుగా అనిపించలేదు.

ఇక ఆయన లుక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఆరు పదుల వయసుకు వచ్చినా రెండు పదుల వయసు తగ్గి మరీ కనిపించాడు.

ఇక హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన గ్లామర్‌తో సినిమాలో హీట్‌ పెంచింది.

ఆమె నటన పరంగా కూడా మంచి మార్కులు దక్కించుకుంది.వెన్నెల కిషోర్‌ కామెడీ సీన్స్‌ అద్బుతం.

ఆయన టైమింగ్‌ మరియు పంచ్‌ డైలాగ్స్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.ఇక రావు రమేష్‌ ఎటకారపు డైలాగ్స్‌ కూడా ప్రేక్షకులను అలరించాయి.

లక్ష్మి మరియు జాన్సీలు వారి పాత్రల పరిధిలో నటించారు.ఇక మిగిలిన వారు కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు.

"""/"/ H3 Class=subheader-styleటెక్నికల్‌ :/h3p పాటల గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు.

చైతన్‌ భరద్వాజ్‌ పాటలు సో సోగానే ఉన్నాయి.ఒకటి రెండు కాస్త పర్వాలేదు అనిపించినా ఓవరాల్‌గా చూస్తే మాత్రం పాటలు సినిమాకు పెద్దగా ప్లస్‌ అయినట్లుగా అనిపించలేదు.

ఒకటి రెండు పాటలు అయితే కాస్త బోరింగ్‌గా అనిపించాయి.అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది.

కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చక్కగా కుదిరింది.పోర్చ్‌గల్‌ అందాలను సినిమాటోగ్రాఫర్‌ చక్కగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు.

కలర్‌ ఫుల్‌గా సినిమా సాగటంలో కూడా సినిమాటోగ్రాఫర్‌ పనితనం ఉంది.దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ స్టోరీ లైన్‌ ను ఇంకాస్త బెటర్‌గా డవలప్‌ చేసి ఉండాల్సింది.

స్క్రీన్‌ప్లే విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.

కొన్ని సీన్స్‌ సాగతీసినట్లుగా ఉన్నాయి.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

H3 Class=subheader-styleవిశ్లేషణ :/h3p మన్మధుడు చిత్రం సక్సెస్‌ అయ్యింది కనుక ఈ చిత్రంపై మొదటి నుండి అంచనాలు పీక్స్‌లోనే ఉన్నాయి.

చిలసౌతో విభిన్నమైన సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌పై నాగార్జున పెద్ద భారమే పెట్టాడు.

దాన్ని నిలుపుకోవడంకు రాహుల్‌ ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండేది.నాగార్జున పాత్రపై శ్రద్ద పెట్టినంతగా ఇతర పాత్రలపై దర్శకుడు శ్రద్ద పెట్టలేదు.

కామెడీ విషయంలో శ్రద్ద తీసుకున్నట్లుగా స్క్రీన్‌ప్లే విషయంలో శ్రద్ద తీసుకున్నట్లుగా అనిపించలేదు.నాగార్జునను అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు.

కాని ఆ ప్రయత్నంలో కథను పక్కదారి పట్టించేశాడు.మొత్తానికి మన్మధుడు 2 చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

"""/"/ H3 Class=subheader-styleప్లస్‌ పాయింట్స్‌ :/h3p నాగార్జున రకుల్‌ గ్లామర్ కామెడీ సీన్స్‌ H3 Class=subheader-styleమైనస్‌ పాయింట్స్‌ :/h3p స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎడిటింగ్‌ పాటలు H3 Class=subheader-styleరేటింగ్‌ : 2.

75/5.0/h3p బోటం లైన్‌ : నాగార్జున ఫ్యాన్స్‌కు ఓకే కాని అందరికి కష్టమే.

ఉసిరి గింజ‌లను పారేస్తున్నారా.. వాటి ప్ర‌యోజ‌నాలు తెలిస్తే షాకైపోతారు!