ప్రపంచానికి ఆ విషయం తెలియదు నాన్న… కృష్ణ మొదటి వర్ధంతి మంజుల ఎమోషనల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగినటువంటి దివంగత నటుడు కృష్ణ గారు ( Superstar Krishna ) మరణించి నేటికీ సరిగ్గా ఏడాది పూర్తి అయింది.
గత ఏడాది నవంబర్ 15వ తేదీ కృష్ణ మరణించారు.ఈయన మరణించి ఏడాది పూర్తి కావడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఆయనని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.
గత ఎడాది ఘట్టమనేని కుటుంబంలో( Ghattamaneni Family ) వరస మరణాలు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కూడా ఎంతగానో బాధపెట్టాయి.
ఇక నేడు కృష్ణ వర్ధంతి కావడంతో ఆయన కుమార్తె మంజుల (Manjula) సోషల్ మీడియా వేదికగా తన తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
"""/" /
ఈ సందర్భంగా మంజుల తన తండ్రితో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ నాన్న మీరు మమ్మల్ని వదిలి వెళ్లి ఏడాది అవుతుంది.
మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము.కానీ మీరు ప్రతి క్షణం మా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది.
మేము మీరు ఉన్న ఇంట్లోనే ఉంటున్నాము మీరు సినిమా షూటింగ్ కు వెళ్లిన అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లిన, వందరోజుల ఫంక్షన్ అయినా వెంటనే తిరిగి ఇంటికి వచ్చేవారు ఇక్కడికి వచ్చి మీరు ఒక సాధారణ వ్యక్తిలా జీవితం గడిపేవారు.
ఎంతో పనిలో నిమగ్నమై ఉన్నటువంటి మీరు అందరి కోసం ఎప్పుడూ అందుబాటులోనే ఉండేవారు.
"""/" /
ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండే మీరు వర్తమానంలోనే జీవించేవారు.
ఇలా హీరోగా కొనసాగుతూ మీ కెరియర్ పరంగా ఎన్నో అద్భుతాలు చేశారు.అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశారు.
అయితే ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి తెలియవు.మీరు ఎక్కడున్నా మీ మనసు ఇంటి మీద ఇంటి సభ్యుల మీదనే ఉండేది.
లవ్ యు నాన్న మీ ప్రేమను ఎప్పటికీ నేను ఫీల్ అవుతూనే ఉంటాను అంటూ ఈ సందర్భంగా మంజుల తన తండ్రి కృష్ణను తలుచుకుంటూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
విదేశాల నుంచి ఆదాయమే లక్ష్యం .. కొత్త డిపార్ట్‌మెంట్‌ను సృష్టించిన డొనాల్డ్ ట్రంప్