ప్రేమించిన భర్తే నాకు శత్రువుగా మారాడు. మనీషా కోయిరాలా కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి మనీషా కోయిరాలా( Manisha Koirala ) నటనకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు.

మనీషా కోయిరాలా నటించిన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి.తాజాగా మనీషా కోయిరాలా మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.

సమ్రాట్ దహల్( Samrat Dahal ) అనే నేపాల్( Nepal ) కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ నటి పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నానని అయితే ఆరు నెలలకే భర్తతో గొడవలు మొదలయ్యాయని తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడని ఆమె చెప్పుకొచ్చారు.

స్త్రీలకు ఇంతకంటే దారుణం ఏముంటుందని మనీషా కోయిరాలా అన్నారు.అలా జరగడం వల్లే విడాకులు తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

నేను ఫేస్ చేస్తున్న సమస్య లాంటి సమస్య ఇంకెవరికీ రాకూడదని మనీషా కామెంట్లు చేశారు.

"""/" / నేను మాత్రమే కాదని మీరు మీ పెళ్లి బంధం విషయంలో సంతోషంగా లేని పక్షంలో విడిపోవడమే మంచిదని ఆమె సూచనలు చేశారు.

నెల్లూరి నెరజాణ సాంగ్ ద్వారా పాపులర్ అయిన ఈ నటి ఈ తరహా కామెంట్లు చేయడంతో ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.

మనీషా కోయిరాలా వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.ఒంటరి జీవితాన్ని అయినా ఈ నటి సంతోషంగా గడపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ నటి పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.ఈ నటి వరుస సినిమాలతో బిజీ కావడంతో పాటు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మనీషా కోయిరాలా హిందీ, తమిళ సినిమాలలో ఎక్కువగా నటించారు.ఈ ఏడాది విడుదలైన షెహజాదా సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

మనీషా కోయిరాలా ఒక నేపాలి సినిమాలో కూడా నటించడం గమనార్హం.

వార్2 సినిమాలో తారక్ రోల్ వివరాలు ఇవే.. దేశం కోసం ప్రాణాలిచ్చే రోల్ అంటూ?