Manisha Koirala : సినిమాల్లో సక్సెస్ సాధించి నిజ జీవితంలో ఓడిపోయిన ఈ స్టార్ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

మనీషా కొయిరాలా( Manisha Koirala ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె పేరు వినగానే ముందుగా ఒకే ఒక్కడు సినిమా గుర్తుకు ఉంటుంది.ఈ సినిమాలో నెల్లూరి నెరజాణ అంటూ ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

అలా తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ కూడా వరుసగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

"""/" / కాగా మనీషా కొయిరాలా అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అప్పట్లో ఈమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

అప్పట్లోనే బాలీవుడ్ లో ఆమెకు దీటుగా సరితూగే నటి లేరనే చెప్పవచ్చు.బాంబే( Bombay ), ఇండియన్ వంటి సినిమాలతో తమిళంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది మనీషా కొయిరాలా.

ఈమె మంచి సంపన్నురాలు కుటుంబంలో జన్మించింది.నేపాల్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ప్రధాని మనవరాలు మనీషా.

అక్కడ రాజకీయ పరిస్థితులు దిగజారడంతో మనీషా తల్లిదండ్రులు వారణాసిలో స్థిరపడ్డారు. """/" / అయితే పదో తరగతి తర్వాత నేపాల్‌( Nepal )కు తిరిగి వచ్చిన మనీషా కొయిరాలా ఓని అనే నేపాలీ చిత్రం ద్వారా నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మోడలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది.అలా హిందీ సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకుంది.

సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే సినిమాల పరంగా మంచి సక్సెస్ను సాధించిన మనీషా కొయిలారా వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

పెళ్ళైన రెండేళ్లకే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది.నేపాల్‌కి చెందిన సమ్రాట్‌ దహల్‌( Samrat Dahal )తో 2010లో వివాహం జరగగా పెళ్లైన ఆరు నెలలకే వీరిమధ్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది.

అయితే సినిమాల్లోకి వచ్చాక మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసగా మారింది మనీషా.

"""/" / దీనికి తోడు ఆమె పెళ్లి, విడాకులతో మరింత డిప్రెషన్‌కు గురైంది.

ఆ తర్వాత తాగడం మొదలుపెట్టిన మనీషా కొయిరాలా ప్రవర్తన అంతా మారిపోయింది.పార్టీలు, మద్యపానం తన జీవితంలో భాగమైపోయాయని మనీషా కొయిరాలా స్వయంగా తానే చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా ఆమె క్యాన్సర్ వ్యాధి( Cancer )తో పోరాడి మరి గెలిచింది.

విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే మనీషా గర్భాశయ క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నట్లు తెలిసింది.

ఇక ఆమె జీవితం ముగిసిపోయిందని అంతా భావించారు.కానీ క్యాన్సర్‌ను జయించి పోరాట యోధురాలిగా నిలిచింది.

ఈ పోరాటం కొత్త జీవితాన్ని ఇచ్చిందని మనీషా కొయిరాలా తన ఆత్మకథ హీల్డ్ పుస్తకంలో ప్రస్తావించింది.

పాన్ కార్డుకు సంబంధించి ఈ మార్పులు చేయండి.. విజయ్ సేతుపతి విజ్ఞప్తి వైరల్!