ఈ బ్యూటీ క్యాన్సర్‌ను జయించింది.. శిఖరాలను అధిరోహిస్తోంది!

ఈ బ్యూటీ క్యాన్సర్‌ను జయించింది శిఖరాలను అధిరోహిస్తోంది!

మనీషా కొయిరాలా తెలుసు కదా.90వ దశకంలో తన అందంతో కుర్రకారు మతులు పోగొట్టిన నేపాలీ బ్యూటీ.

ఈ బ్యూటీ క్యాన్సర్‌ను జయించింది శిఖరాలను అధిరోహిస్తోంది!

అందం, అభినయంతో తనకంటూ అభిమానులను సంపాదించుకుంది.అయితే 2012లో ఆమెను క్యాన్సర్‌ మహమ్మారి చుట్టుముట్టింది.

ఈ బ్యూటీ క్యాన్సర్‌ను జయించింది శిఖరాలను అధిరోహిస్తోంది!

ఈ ప్రాణాంతక వ్యాధి తనలో ఆందోళన రేపినా.మొండి ధైర్యంతో దానిని జయించింది.

అంతేకాదు ఇప్పుడు ఏకంగా శిఖరాలను అధిరోహిస్తోంది.క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోతోపాటు ఇప్పుడు ఓ పర్వతంపైకి ఎక్కుతున్న ఫొటోలను పోస్ట్‌ చేస్తూ మనీషా ఈ మధ్య ఓ ట్వీట్‌ చేసింది.

తనకు రెండో జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.ఇదో అద్భుతమైన జీవితం అని, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని మనీషా ఆకాంక్షించింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/12/Manisha-Koirala-is-grateful-for-second-chance-to-life-బ్యూటీ-క్యాన్సర్‌ను-జయించింది!--jpg"/తన ఫ్రెండ్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా మనీషా రెండు రోజుల పాటు మంచు పర్వతాల్లో విహరించింది.

ఈ సందర్భంగానే అక్కడ తాను ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.

క్యాన్సర్‌ మహమ్మారి బారి నుంచి బయటపడిన తర్వాత తన అనుభవాలను వివరిస్తూ మనీషా ఓ పుస్తకం కూడా రాసింది.

దాని పేరు "హీల్డ్‌: హౌ క్యాన్సర్‌ గేవ్‌ మి న్యూ లైఫ్‌".