కెనడా పార్లమెంటరీ సెక్రటరీగా భారతీయుడు.. ఎవరీ మనీందర్ సిద్ధూ..!!

కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో భారతీయులు కీలక పదవులను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా భారత సంతతికి చెందిన ఎంపీ మనీందర్ సిద్ధూని సైతం ప్రధాని ట్రూడో కీలక పదవిలో నియమించారు.

అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి కరీనా గౌల్డ్‌కు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.

భారత సంతతికే చెందిన కెనడా ఎంపీ కమల్ ఖేరా.గతంలో కరీనా గౌల్డ్ పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.

కరోనా నిబంధనలు ఉల్లఘించినట్లు విమర్శలు రావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో మనీందర్ సిద్ధును పార్లమెంట్ సెక్రటరీగా జస్టిన్ ట్రూడో నియమించారు.దీనిపై మనీందర్ స్పందిస్తూ.

పార్లమెంటరీ కార్యదర్శిగా తనను నియమించినందుకు గాను ప్రధాని ట్రూడోకు కృతజ్ఞతలు తెలిపారు.ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మనీందర్ చెప్పారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన 23 మంది ఇండో కెనడియన్లలో మనీందర్ సిద్ధూ ఒకరు.

బ్రాంప్టన్ ఈస్ట్ నుంచి మొదటిసారి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు మనీందర్.భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈయన కెనడా రాజకీయాల్లోకి రాకముందు కస్టమ్స్ బ్రోకరేజ్ వ్యాపారాన్ని నిర్వహించారు.

వాటర్లూ యూనివర్సిటీలో చదువుకున్న మనీందర్ సిద్ధూ.ఆయనకి భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు.

ఇప్పటికే భారత సంతతికి చెందిన ఆరిఫ్ విరాణి పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.కెనడా జనాభాలో 3 శాతం మంది భారత సంతతి ప్రజలు వున్నారు.

జస్టిన్ ట్రూడో కేబినెట్‌లో ముగ్గురు ఇండో - కెనడియన్లు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

రక్షణ మంత్రిగా హర్జిత్ సజ్జన్, పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా అనితా ఆనంద్, యువజన శాఖ మంత్రిగా బర్దిష్ చాగర్ విధులు నిర్వర్తిస్తున్నారు.

దేశంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో అనితా ఆనంద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.కరోనా మొదలైనప్పటి నుంచి ఆమె అన్నితానై వ్యవహరిస్తున్నారు.

కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు టెస్టులు నిర్వహించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించడం వంటి చర్యల ద్వారా వైరస్ దూకుడుకు అడ్డుకట్ట వేశారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కెనడా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని అనితా ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఏ దేశంలో చూసినా పీపీఈ కిట్లు, వ్యాక్సిన్‌కు తీవ్రమైన పోటీ వున్నప్పటికీ.

ఆమె ముందు చూపుతో వ్యవహరించారు.వివిధ దేశాల నుంచి పీపీఈ కిట్లు, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పాటు 40 కోట్ల వ్యాక్సిన్ డోసులను దిగుమతి చేసుకున్నారు.

ప్లీజ్ సాయం చేయండి…కన్నీళ్లు పెట్టుకున్న వైవా హర్ష… ఏమైందంటే?