మణిరత్నం నవరస కోసం తొమ్మిది కథలకి తొమ్మిది మంది హీరోలు

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా మొదలైంది.ఈ నేపధ్యంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో కీలకంగా ఉన్న ఓటీటీ మాధ్యమాలకి డిమాండ్ పెరిగింది.

అదే సమయంలో సినిమాలు అన్ని కూడా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేస్తున్నారు.

వెబ్ సిరీస్ ల హవా కూడా మొదలైంది.వీటిని వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

దీంతో దర్శక, నిర్మాతలు అందరూ వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెట్టారు.

సినిమాలు లేని దర్శకులు ఇప్పటికే వెబ్ సిరీస్ లు చేస్తూ ఉంటే, ఆల్ రెడీ సినిమాలు చేస్తున్నవారు కూడా వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించేందుకు సిద్ధం అవుతున్నారు.

వీటి ద్వారా తాము చెప్పాల్సిన విషయం ఇంకా షూటింగ్ చెప్పొచ్చు అన్ని ఈ ప్లాట్ ఫామ్ ఎంచుకుంటున్నారు.

ఇప్పుడు ఈ దారిలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా వచ్చి చేరారు.నవరస పేరిట తొమ్మిది ఎపిసోడ్లను వెబ్ సిరీస్ నిర్మించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు.

ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక్కో హీరో నటిస్తాడు.అలాగే ప్రతి ఎపిసోడ్ కీ ఒక్కొక్కరు దర్శకత్వం వహిస్తారు.

ఇప్పటికే వీటికి దర్శకులుగా నటులు అరవింద్ స్వామి, సిద్ధార్థ్ లతో పాటు గౌతం మీనన్, బిజోయ్ నంబియార్, సుధ కొంగర, కేవీ ఆనంద్, జయేంద్ర, కార్తీక్ నరేన్ లని ఎంపిక చేశారు.

ఇక ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ లో హీరోలుగా దక్షిణాదికి చెందిన పేరున్న హీరోలను నటింపజేయడానికి మణిరత్నం ప్రయత్నం చేస్తున్నారు.

సూర్య, ఫహద్ ఫాజిల్, నాగార్జున, నాని, నాగ చైతన్య, కార్తికేయ వంటి హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ ప్రశాంత్ నీల్ కాంబో లో సినిమా వచ్చేది అప్పుడేనా..?