Currency In Manhole : ఇదేందయ్యా ఇది.. మ్యాన్‌హోల్ నిండా కరెన్సీ నోట్లు, నాణేలు..

సాధారణంగా నాణేలు లేదా నోట్ల కట్టలు భూమిలో దొరుకుతుంటాయి.కొంతమంది వీటిని గోడలలో కూడా దాస్తుంటారు.

ఇలాంటివి అప్పుడప్పుడు బయటపడుతూ చాలామందికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంటాయి.డబ్బును చాలామంది దేవాలయాల్లో కూడా కానుకలుగా అందజేస్తుంటారు.

పవిత్రమైన ప్రదేశాల్లో డబ్బు బహిరంగంగానే కనిపిస్తూ ఉంటుంది.అయితే ఇటీవల ఎవరూ ఊహించని చోట కరెన్సీ నోట్లు, నాణేలు కనిపించాయి.

ఇంతకీ ఆ ప్లేస్ ఏదో కాదు, చెత్తా చెదారం పడేసే మ్యాన్‌హోల్.( Manhole ) """/" / ఫ్రాన్స్‌లోని( France ) స్ట్రాస్‌బర్గ్‌లో( Strasbourg ) ఇటీవల కరెన్సీ కాయిన్స్ కనిపించాయి.

ఈ నగరంలోని విద్యుత్ తీగలు ఉన్న ఒక గుంటపై ఒక మెటల్ గ్రేట్ ఉంచారు.

ఆ మెటల్ గేటు కింద మ్యాన్‌హోల్ ఉంది.గేటుపై నుంచి చూస్తే కింద నగదు, నాణేలు( Currency ) కనిపించాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిలాడ్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంది.ఈ వీడియోకు ఇప్పటికే 30 వేల దాక లైక్‌లు వచ్చాయి.

ఈ డబ్బు ఇక్కడ ప్రజలు ఎందుకు వేస్తున్నారు అనేది ఒక రహస్యంగా మిగిలిపోయింది.

"""/" / వీడియో చూసిన నెటిజన్లు డబ్బును ఎలా తిరిగి పొందాలనే దానిపై ఫన్నీ సజెషన్స్ ఇచ్చారు.

స్టిక్కీ ఎరతో ఫిషింగ్ రాడ్‌ని ఉపయోగించాలని కొందరు సలహా ఇచ్చారు.ఇది వేరే నగరంలో ఉంటే డబ్బు ఇప్పటికే అందులోని డబ్బంతా మాయమైపోయి ఉండేదని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.

పబ్లిక్ స్పాట్‌లో డబ్బు ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇది మొదటిసారి కాదు.ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌లో, విక్టోరియా సెంటర్‌లోని ఛారిటీ ఫౌంటెన్‌లో కూడా నాణేలు బయట కనిపిస్తూ దొంగలు దృష్టిని ఆకర్షించాయి.

ఈ సంఘటన డబ్బుకు ఉన్న విలువ, దానిని తిరిగి పొందేందుకు ప్రజలు ఎంతగా తాపత్రయం పడుతున్నారనే దాని గురించి మనకి తెలియజేస్తోంది.