ఆయిల్ స్కిన్‌ను ఈజీగా నివారించే మామిడిపండు..ఎలావాడాలంటే?
TeluguStop.com
ఆయిల్ స్కిన్.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది.
ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా.మళ్లీ కొంత సమయానికి ముఖం జిడ్డుగా మారిపోతుంటుంది.
దాంతో ఎంత అందంగా, తెల్లగా ఉన్నా.అందహీనంగా కనిపిస్తుంటారు.
ఇక ఈ సమస్యను నివారించుకునేందుకు ఫేస్ వాష్‌లు, ఫేస్ క్రీములు మారుస్తూ.నానా తంటాలు పడుతుంటారు.
అయితే న్యాచురల్‌గా కూడా ఆయిల్ స్కిన్‌ను సమస్యకు చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా ఆయిల్ స్కిన్‌ను నివారించడంలో మామిడి పండ్లు అద్భుతంగా సమాయపడతయాయి.
సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే.ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనివిందు చేస్తుంటారు.
మామిడి పండ్లు చూసేందుకు, తినేందుకు రుచిగా ఉండటమే కాదు.బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడాల ఏకుండా అందరూ మామిడి పండ్లను ఇష్టంగా తింటుంటారు.
ఇక మామిడి పండ్లు ఆరోగ్యానికే కాకుండా.చర్మ సౌందర్యానికి కూడా గ్రేట్‌గా సహాయపడతాయి.
ముఖ్యంగా ఆయిల్ స్కిన్‌తో బాధ పడే వారు.బాగా పండిన మామిడి పండు నుంచి గుజ్జు తీసుకుని ఒక బౌల్‌లో వేసి.
అందులో కొద్దిగా బియ్యం పిండి మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా తరచూ చేస్తే.ముఖంపై అతిగా ఉండే జిడ్డు పోయి ఫ్రెష్‌గా మారుతుంది.
అలాగే ఒక బౌల్‌లో బాగా పండి మామిడి పండు గుజ్జు, గోధుమ పిండి మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి.బాగా డ్రై అవ్వనివ్వాలి.
ఆ తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి.మెల్ల మెల్లగా రుద్దుతూ ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా డే బై డే చేస్తూ ఉంటే.ఆయిల్ స్కిన్ సమస్య దూరం అవుతుంది.
వైరల్ వీడియో: ఇలా ఉన్నరేంట్రా.. థియేటర్‌లో ఉచిత పాప్‌కార్న్ ఇవ్వడంతో ఏకంగా?