కిడ్నీలో రాళ్లున్నవారు మామిడిపండ్లు తింటే ఏం అవుతుందో తెలుసా?
TeluguStop.com
కిడ్నీలో రాళ్లు ఇటీవల కాలంలో అధిక శాతం మందిని వేధిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి.
కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వరకు అవి ఉన్నాయని కూడా చాలా మంది గుర్తించలేరు.
అందువల్ల, సమస్య మరింత తీవ్రమై ఆపరేషన్ చేయించుకుని రాళ్లను తొలిగించుకునే వరకు వెళ్లాల్సి వస్తుంటుంది.
ఇక కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి చాలా కారణాలే ఉన్నాయి.ఆహారపు అలవాట్లు, డీహైడ్రైషన్, మారిన జీవన శైలి, మద్యపానం, అధికంగా ఉప్పు తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
అయితే ఈ రాళ్లను కరిగించుకునేందుకు కూడా చాలా మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి.
అలాంటి వాటిలో మామిడి పండ్లు ఒకటి.సాధారణంగా సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనువిందు చేస్తుంటాయి.
మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాదు పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి.అందుకే మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
"""/"/
ముఖ్యంగా కిడ్నీలో రాళ్లను కరిగించడంలో మామిడి పండ్లు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్న వారు మామిడి పండ్లతో తయారు చేసిన జ్యూస్ లేదా మామిడి పండ్లును డైరెక్ట్‌గా తీసుకోవడం చేస్తే అందులో ఉండే పలు పోషకాలు త్వరగా రాళ్లను కరిగిస్తాయి.
అలాగే కిడ్నీ డ్యామేజ్‌ను కూడా అరికడతాయి.అయితే మామిడి పండ్లను అతిగా మాత్రం తీసుకోరాదు.
ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, ఎంత రుచిగా ఉన్నప్పటికీ మామిడి పండ్లను ఓవర్‌గా తీసుకుంటే శరీర వేడికి దారి తీస్తుంది.
అలాగే వెయిట్ గెయిన్ అవ్వడం, బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.
సో లిమిట్‌గానే మామిడి పండ్లను తీసుకోండి..
యాక్టింగ్ వదిలేయాలనుకుంటే భార్య మాటలే నిలబెట్టాయి.. శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్!