మామిడి టెంకతో ఇలా చేస్తే చుండ్రు స‌మ‌స్య ప‌రార్‌!

ప్ర‌స్తుతం వేస‌వి కాలం స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా నోరూరించే మామిడి పండ్లే క‌నువిందు చేస్తుంటాయి.

ఆక‌ర్షించే రంగు, అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండే మామిడి పండ్ల‌లో బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండుగా ఉంటాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, బీటా కెరోటిన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు మామిడి పండ్ల ద్వారా పొందొచ్చు.

అందుకే మామిడి పండ్ల‌ను డైట్‌లో చేర్చుకోమ‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే మామిడి పండ్ల విష‌యంలో చాలా మంది కామ‌న్‌గా చేసే పొర‌పాటు.

లోప‌ల ఉండే టెంకను పారేడం.నిజానికి మామిడి టెంకె కూడా ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా చుండ్రు స‌మ‌స్య‌ను నివారించ‌డంలో మామిడి టెంక గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి దీని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ మామిడి టెంకలో ఉండే గింజ‌ను తీసుకుని బాగా ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిలో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుని త‌ల‌కు ప‌ట్టించాలి.

అర గంట లేదా ఒక గంట పాటు ఆర‌నిచ్చి.అనంత‌రం సాధార‌ణ షాంపూతో త‌ల స్నానం చేసేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఇక తెల్ల జుట్టుకు చెక్ పెట్ట‌డంలోనూ మామిడి టెంక్ ఉప‌యోగ‌ప‌డుతుంది.మామిడి టెంక‌లో ఉండే గింజ‌ను పొడి చేసుకుని.

అందులో కొద్దిగా కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని కేశాల‌కు, కుదుళ్ల‌కు ప‌ట్టించి.

గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత హెడ్ బాత్ చేయాలి.

ఇలా చేస్తూ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.మ‌రియు జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

హీరో అజిత్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన భార్య షాలిని.. అసలేం జరిగిందంటే?