కిడ్నీలో రాళ్లను కరిగించే మామిడాకులు.. ఎలాగంటే?
TeluguStop.com
కిడ్నీ స్టోన్స్ లేదా మూత్ర పిండాల్లో రాళ్లు.వయసుతో సంబంధం లేకుండా నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.
ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, నీరు తక్కువగా తీసుకోవడం, స్ధూలకాయం, పోషకాహార లోపం ఇలా రకరకాల కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వరకు కూడా అవి ఉన్నట్లు గుర్తించకపోవడం వల్ల.
సమస్య తీవ్రతరమై ఆపరేషన్ వరకు వెళ్లాల్సి వస్తుంది.అయితే కొన్ని కొన్ని లక్షణాల బట్టీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తించవచ్చు.
ముఖ్యంగా మూత్ర విసర్జన సమయంతో తీవ్రమైన నొప్పి మరియు మంట రావడం, తరచూ మూత్రం రావడం, యూరిన్ దుర్వాసన రావడం, వీపు కింద కుడి లేదా ఎడమ భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.
అంతేకాదు, వెంటనే డాక్టర్‌ను సంప్రదించి.తగిన మందులు వాడాలి.
అలాగే అపరేషన్ వరకు వెళ్లకుండా.కిడ్నీలో రాళ్లను త్వరగా కరిగించుకోవాలంటే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించాలి.
ఎందుకంటే, వైద్య పరంగానే కాకుండా.ఇంటి చిట్కాలతో కూడా కిడ్నీలో రాళ్లను ఫాస్ట్‌గా కరిగించుకోవచ్చు.
ముఖ్యంగా మామిడి ఆకులు కిడ్నీలో రాళ్లను కరిగించడంతో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.అవును, రెండు లేదా మూడు మామిడి ఆకులను తీసుకుని నీటిలో శుభ్రం చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఆ పేస్ట్‌ను ఒక గ్లాస్ వాటర్‌లో కలిపి సేవించాలి.ఇలా ప్రతి రోజు ఒక గ్లాస్ చప్పున తీసుకుంటే.
కిడ్నీలో రళ్లు త్వరగా కరిగిపోతాయి.ఇక మామిడి ఆకులు కిడ్నీలో రాళ్లను కరిగించడమే కాదు.
బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలోనూ, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలోనూ, ఒత్తిడి మరియు డిప్రెషన్ సమస్యలను దూరం చేయడంలోనూ, చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలోనూ ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
కాబట్టి, మామిడి ఆకులును నీళ్లలో మరిగించి తీసుకోవడం లేదా నానబెట్టి తీసుకోవడం లేదా పౌడర్ చేసి ఉపయోగించడం చేస్తే చాలా మంచిది.
2025 స్ట్రీమింగ్ సినిమాలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. ఓజీ, మాడ్ స్క్వేర్ తో పాటు ఆ సినిమాలు!