మామిడి టెంకలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

వేసవికాలం వచ్చిందంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది మామిడికాయ.తియ్యగా,పుల్లగా ఉండే మామిడికాయ అంటే అందరికి ఇష్టమే.

అందరు చాల ఇష్టంగా తింటారు.కానీ మనం మామిడికాయను తినేసి టెంకను పాడేస్తాం.

కానీ టెంకలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.మొదట మామిడి టెంకలోని జీడిని తీసి పొడిగా తయారుచేసుకోవాలి.

ఈ పొడిలో వెన్న కలిపి ముఖానికి రాస్తే ముఖం చాలా ప్రకాశవంతంగా మారుతుంది.

మామిడి టెంక పొడిలో కొబ్బరి నూనె,ఆలివ్ నూనె,ఆవ నూనె కలిపి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టుకు పోషణ ఇవ్వటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయటంలో సహాయపడుతుంది.

ఈ పొడిలో నీళ్లు కలిపి పేస్ట్ గా చేసి తల మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య మాయం అవుతుంది.

ఈ పొడిలో తేనే కలిపి ప్రతి రోజు పరగడుపున సేవిస్తే ఉబ్బసం,దగ్గు వంటివి తగ్గుతాయి.

ఒక గ్లాస్ మజ్జిగలో అరస్పూన్ మామిడి టెంకల పొడిని ,చిటికెడు ఉప్పును కలిపి త్రాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం,అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

వేసవికాలంలో వేడి తగ్గాలంటే మామిడి టెంక పొడి,జీలకర్ర, మెంతుల పొడి మూడింటిని సమానంగా తీసుకోని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలి.

చాలా సమర్ధవంతంగా వేడిని తగ్గిస్తుంది.

పవన్ ప్రాధాన్యం పెరుగుతోందిగా.. జమిలి ఎన్నికలొస్తే డబుల్ బెనిఫిట్