భార్య మంగళసూత్రం ధరించే సమయంలో చేయకూడని తప్పులివే..?
TeluguStop.com
మన భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు.మనం చేసే ప్రతి పనిలో అర్థం, పరమార్థం దాగి ఉంటుంది.
భారతదేశంలో ముఖ్యంగా పెళ్లైన ఆడవారు మంగళసూత్రాన్ని ధరించడం ఆనవాయితీ.ఈ మంగళసూత్రాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు.
అసలు పెళ్లి అయిన వారు తాళి ని ఎందుకు ధరిస్తారో సరైన కారణం బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు.
మంగళసూత్రం ఎందుకు ధరిస్తారో? మంగళసూత్రం ధరించినపుడు చేయకూడని పనులు ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా కొన్ని ప్రాంతాలలోని మహిళలు మంగళసూత్రానికి కేవలం నల్లపూసలు మాత్రమే ధరించి ఉంటారు.
మరికొందరు నల్లపూసలు వాటి మధ్యలో బంగారు రంగు పూసలను ధరిస్తుంటారు.మరి కొందరు కేవలం పసుపు తాడు ని మంగళసూత్రం గా భావిస్తుంటారు.
అయితే మహిళలు నల్ల పూసల తో పాటు బంగారు వర్ణంలో ఉన్న పూసలు మంగళసూత్రంలో ధరించడం వల్ల వారు ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగళి గా వర్ధిల్లుతారు.
మెడలోని నల్లని పూసలు శివునికి ప్రతీక, బంగారు వర్ణం పూసలు పార్వతీదేవిగా భావిస్తారు.
అటువంటి మంగళసూత్రం మెడలో ఉంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు.
పెళ్లికూతురు సుమంగళిగా ఉండి తన భర్త కు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పార్వతీ పరమేశ్వరులు మన హృదయానికి దగ్గరగా ఈ మంగళసూత్రం లో కొలువై ఉంటారు.
సాధారణం గా పెళ్లి లో మూడు ముళ్ళు వేసేటప్పుడు పసుపు తాడుతో మూడు ముడులు వేస్తూ ఒక్కో ముడి దగ్గర పసుపు,కుంకుమలను పెడతారు.
అలా పసుపు కుంకుమలు పెట్టడం వల్ల సర్వ మంగళ దేవి మంగళసూత్రం లో కొలువై ఉంటారని మన నమ్మకం.
తరువాత పదహారవ రోజున ఆ పసుపు తాడు ను ఏదైనా పచ్చని చెట్టుకు కట్టి, బంగారు మంగళ సూత్రాన్ని ధరిస్తారు.
బంగారు మంగళసూత్రాన్ని ధరించినప్పటికీ వాటి మధ్యలో పసుపు తాడును కడతారు.కొంతమంది మంగళ సూత్రాల పై వారి ఇంటి కులదైవం, లేదా వారికి ఇష్టమైన దేవుళ్లను మంగళసూత్రం పై వేయించుకుని ధరిస్తారు.
ఇలా చేయడంవల్ల తమంతట తామే కష్టాలను కొనితెచ్చుకున్నట్లు.ముఖ్యంగా మంగళసూత్రం పై లక్ష్మీదేవి ప్రతిమ అస్సలు ఉండకూడదు.
అలా ఉండటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు తగ్గిపోయి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
అందువల్ల ఎటువంటి పరిస్థితులలో కూడా దేవుడి ప్రతిమలను మంగళసూత్రం పై వేసుకోకూడదు అని పండితులు చెబుతుంటారు.
ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారిని పూజించుకొని ఆ పసుపు కుంకుమలను మంగళసూత్రానికి పెట్టడం ద్వారా వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వసిస్తారు.
ఎవరి జీవితాలు వారివే… బ్రేకప్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నిఖిల్…పోస్ట్ వైరల్!