శక్తి పీఠాలలో ఒకటైన మంగళ గౌరీ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

మన సనాతన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.అలాంటి వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచారామం వంటివి ఎన్నో ఉన్నాయి.

జ్యోతిర్లింగాలలో ఆ పరమ శివుడు కొలువై ఉంటే అష్టాదశ శక్తి పీఠాలలో సాక్షాత్తు ఆ జగన్మాత కొలువై ఉంటుంది.

పురాణాల ప్రకారం దక్షుడు యజ్ఞం చేస్తున్న సమయంలో ఆ యజ్ఞానికి దేవాది దేవతలందరినీ ఆహ్వానిస్తాడు.

అయితే ఆ పరమశివుడికి ఆహ్వానం పంపించడు.అయినప్పటికీ తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకొనే పార్వతీదేవి వెళ్తుంది.

అక్కడ ఎన్నో అవమానాలు భరించలేక ఆ అగ్ని హోమంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

ఆ విధంగా పార్వతీదేవి మరణంతో శివుడు తాను నిర్వహించాల్సిన కార్యక్రమాలను మానేస్తాడు.దీంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా 18 ఖండాలుగా చేసి శివుడికి కర్తవ్య బోధ చేస్తాడు.

ఆ విధంగా విష్ణుమూర్తి వధించినప్పుడు పార్వతీ దేవి శరీరభాగాలు పడిన ప్రదేశంలో ఈ శక్తి పీఠాలు వెలిశాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ విధంగా వెలిసిన పద్దెనిమిది పీఠాలలో ఒకటిగా మంగళ గౌరీ ఆలయం. """/"/ ఈ మంగళ గౌరీ ఆలయం భారత దేశంలోని బీహార్ లో గల ‘గయా’ లో కొలువైన అమ్మ వారు భక్తుల కోరికలు తీరుస్తుంది.

పార్వతి దేవి తొడ భాగం ఈ ప్రదేశంలో పడటం వల్ల అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామం ఉంటుంది.

దీనినే మంగళగౌరీగా పూజిస్తారు.ఈ ఆలయాన్ని దర్శించిన వారి కోరికలు తప్పకుండా నెరవేరతాయనీ ఇక్కడ ప్రజల నమ్మకం.

అంతేకాకుండా తన భర్త దీర్ఘాయుష్షు కోసం ఎంతోమంది పుణ్యస్త్రీలు ఈ ఆలయంలో మంగళగౌరీ వ్రతం నిర్వహిస్తుంటారు.

అంతేకాకుండా పెళ్లి సమయంలో వధువు చేత తన వివాహ జీవితం బాగుండాలని మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహించడం మనం చూస్తూనే ఉన్నాము.

నాగచైతన్య తండేల్ తో పాన్ ఇండియా లో సక్సెస్ కొడుతాడా..?