సీఎం జగన్ పై మందకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది.ప్రచారానికి ఇది చివరివారం కావడంతో ప్రధాన పార్టీల నేతలు భారీ ఎత్తున బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.అదేవిధంగా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో అన్న దానిపై రకరకాల హామీలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ( Manda Krishna Madiga ) సీఎం జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని జగన్ నాశనం చేశారని అన్నారు.రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు.

అనంతపురంలో మందకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లో( YCP Govt ) ఎస్సీ ప్రజలు ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికలలో జగన్ ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.మరి కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని( NDA Alliance ) గెలిపించుకుంటే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని మంద కృష్ణ స్పష్టం చేయడం జరిగింది.

"""/" / 2019 కంటే ఈసారి ఎన్నికలు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి.

ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నదానిపై ఎవరు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగడం జరిగింది.

మరోపక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ.టీడీపీ.

జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.గతంలో ఇవే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2014లో ప్రభుత్వం స్థాపించటం జరిగింది.

మరి ఈసారి కూడా ఆ రకంగానే గెలవాలని భావిస్తున్నారు.మరి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

ఆ విషయం నాకు మాత్రమే తెలుసు… శోభిత పెళ్లి ఫోటోలపై సమంత కామెంట్స్!