మంచు ఫ్యామిలీ వివాదంలోకి చిరు… జర్నలిస్టు తీరుపై మండిపడిన ప్రొడ్యూసర్!
TeluguStop.com
గత మూడు రోజులుగా మంచు కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ గొడవలు సర్దుమనుగుతాయి అనడం కంటే కూడా మరింత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీ గొడవల గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఇకపోతే మంగళవారం సాయంత్రం మోహన్ బాబు ( Mohan Babu )మీడియా ప్రతినిధులపై దాడి చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ దాడిలో భాగంగా ఇద్దరు రిపోర్టర్స్ తీవ్ర గాయాల పాలయ్యారు.ఇక ఈ విషయం గురించి ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు మీడియా( Senior Journalists Media ) సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపడమే కాకుండా బహిరంగంగా మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
"""/" /
ఇలాంటి తరుణంలోనే సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ ( Ravi Prakash )సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతూ పోస్ట్ చేశారు.
మోహన్ బాబు అసలు నువ్వు మనిషివేనా అంటూ ఈయన సంచలన పోస్ట్ వేశారు.
మీ చేష్టలు చాలా సిగ్గుగా ఉంటున్నాయి.ఒకప్పుడు చిరంజీవిని కించపరిచారు.
మీ స్టాఫ్ పట్ల కూడా దుర్భాషలాడుతూ ఉంటారు.ఇక ఇప్పుడు మీడియా ప్రతినిధులపై కూడా మీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
ఇప్పటివరకు మీరు చేసింది చాలు.ఇకపై ఎలాంటి పరిస్థితులలో కూడా మీ చేష్టలను భరించేది లేదు అంటూ ఈయన మోహన్ బాబు వ్యవహార శైలిని తప్పుపడుతూ పోస్ట్ చేశారు.
"""/" /
ఇక ఈ పోస్టులో చిరంజీవిని కూడా కించపరిచారు అంటూ ఈయన ఈ వివాదంలోకి చిరంజీవిని లాగడంతో ప్రముఖ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఇలా రవి ప్రకాష్ ట్వీట్ ను రీ పోస్ట్ చేస్తూ అసలు ఇప్పుడు ఇక్కడ చిరంజీవిని ఎందుకు లాగారు? ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారు? అంటూ ప్రశ్నించారు.
ఇది అనవసరం అంటూ ఎస్ కే ఎన్ ఫైర్ అయ్యారు.అయితే గతంలో మోహన్ బాబు చిరంజీవి మధ్య జరిగిన గొడవ కారణంగా ఇప్పటికీ వీరిద్దరి మధ్య కోల్డ్ వారు జరుగుతూనే ఉంది.
ఇలాంటి తరుణంలో చిరంజీవి పేరును ప్రస్తావించడం అనవసరం అనే ఉద్దేశంతో ఈయన పోస్ట్ చేశారు.
వీడియో వైరల్: అయ్యబాబోయ్.. పావురానికి ఇలా కూడా ట్రైనింగ్ ఇస్తారా?