కమ్మలు పెట్టుకున్నా అంటూ ఫోటో షేర్ చేసిన మంచులక్ష్మి.. నెటిజన్స్ ట్రోల్స్?

ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ట్రోల్స్ చేద్దామా అని నెటిజన్లు బాగా ఎదురుచూస్తూ ఉంటారు.

పొరపాటున ఎవరైనా సెలబ్రెటీ ఏదైనా పొరపాటు చేస్తే చాలు.నెటిజన్లు వాటిని వెంటనే పట్టేసుకొని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

వాటిని క్షణాల్లో వైరల్ గా మారుస్తారు.అలా ఇప్పటికీ చాలామంది సెలబ్రెటీలు బాగా ట్రోల్స్ కు గురయ్యారు.

అలా మంచు లక్ష్మి కూడా చాలాసార్లు దొరికిపోయింది.తాజాగా మరోసారి దొరికిపోయింది మంచు లక్ష్మి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు లక్ష్మి గురించి అందరికి తెలిసిందే.ఆమె ఒక నటిగా కంటే వ్యక్తిగతంగా పరిచయాన్ని పెంచుకుంది.

తెలుగులో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.కానీ ఇండస్ట్రీలో నటిగా ఎక్కువ కాలం నిల్వలేకపోయింది.

ఇక వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోలలో వ్యాఖ్యతగా చేసింది.అంతేకాకుండా ఓటీటీ వేదికగా ఆహా లో ఓ వంటల షో కూడా చేసింది.

ఇందులో మొత్తం సెలెబ్రేటిలతోనే వంటలు చేయించింది.ఇక ఈమె ఎక్కడైనా ఇంటర్వ్యూ లలో లేదా ఈవెంట్ లలో పాల్గొంటే చాలు ఆ వేదిక మొత్తం తన తెలుగు బాషాతో బాగా సందడిగా మారుతుంది.

ఎందుకంటే తను మాట్లాడే తెలుగు బాషా గురించి అందరికి తెలిసిందే. """/" / తన భాషతో ఇప్పటికే చాలా సార్లు ట్రోల్స్ ఎదురుకుంది.

అంతేకాకుండా కొందరి సెలబ్రేటిలకు పలు వేదికలపై తన బాషా గురించి వివరణ కూడా ఇచ్చింది.

ఇక ఈమె సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక కొన్ని రోజుల కిందట యూట్యూబ్ లో కూడా తన పేరు మీద ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో చాలా విషయాలు పంచుకుంది.

తన హోమ్ టూర్ వీడియోలను తన కూతురి వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది.

తను వర్క్ అవుట్ లు కూడా బాగా చేస్తూ ఉంటుంది.వాటికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది.

ఇక ఇటీవలే తనకు కరోనా వైరస్ కూడా సోకగా ఆ విషయం కూడా తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు షేర్ చేసుకుంది.

"""/" / ప్రస్తుతం తను హోమ్ క్వారంటైన్ లో ఉంది.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో పంచుకుంది.

ఆ ఫొటోలో తను కమ్మలు పెట్టుక్కొని ఉండగా ఆ ఫోటో కు లక్ష్మి.

'కామాలు పెట్టుకున్న' అని కాప్షన్ ఇచ్చింది.ఇక అంతే సంగతి.

నెటిజన్లు ఓ రేంజ్ లో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.కామాలు, పుల్ స్టాప్ లు కాదమ్మా.

కమ్మలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఎమ్ వెళ్లి ఎమ్ మీద కూర్చోవాలి అంటూ ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

జాన‌ప‌ద గీతానికి డ్యాన్స్‌ అదరగొట్టిన మిస్టర్ కూల్.. వీడియో వైర‌ల్‌