స్నేక్ బ్యాచ్ అంటూ సెటైర్లు వేసిన మంచు విష్ణు.. నాగబాబునే టార్గెట్ చేశారంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు విష్ణు( Hero Manchu Vishnu ) ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అయితే మంచు విష్ణు తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

తనపై ట్రోల్స్ రావడం నిజమేనని అయితే ఆ ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోనని మంచు విష్ణు అన్నారు.

"""/" / ప్రస్తుత కాలంలో ట్రోలింగ్( Trolls ) వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని మంచు విష్ణు కామెంట్లు చేశారు.

అయితే కొన్ని సందర్భాల్లో ట్రోల్స్ హద్దులు దాటుతున్నాయని అలాంటి ట్రోల్స్ ను మాత్రం అస్సలు సహించనని ఆయన చెప్పుకొచ్చారు.

కొంతమంది తన గురించి వేసే సెటైర్లు బాగుంటాయని అలాంటి వాటిని చూసి తాను కూడా ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొందరు డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారని అలా చేయడం మాత్రం తన దృష్టిలో తప్పు అని విష్ణు పేర్కొన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు( MAA Elections ) ముందు నాపై ట్రోల్స్ ఉండేవి కాదని ఎలక్షన్స్ తర్వాతే నాపై ట్రోల్స్ మొదలయ్యాయని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఆ ట్రోల్స్ ఎవరు చేయించారో అందరికీ తెలుసని ఆ స్నేక్ బ్యాచ్( Snake Batch ) గురించి ఇప్పుడు ఎందుకని విష్ణు పేర్కొన్నారు.

"""/" / నాగబాబు( Nagababu ) పేరు ప్రస్తావించకుండానే మంచు విష్ణు ఈ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కథ, కథనం విషయంలో మంచు విష్ణు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఆ ఏరియాలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్లే రాలేదా.. అసలేం జరిగిందంటే?