గరికపాటి కాంట్రవర్సీపై మంచు విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న ఒకే అంశం గరికపాటి చిరంజీవి ల వివాదం.

కాగా ఈ గరికపాటి నరసింహారావు, చిరంజీవి ల వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

చిరంజీవి తన మాటలతో ఆ వార్తలకు చెక్ పెట్టినప్పటికీ వీరి వివాదానికీ సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహానికి లోనయ్యారు.

కాగా ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది.

మెగాస్టార్ స్థాయిని గరికపాటి స్థాయిని పోల్చుతూ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.అంతేకాకుండా ఈ వివాదంలో గరికపాటిని గరికతో సమానంగా తీసిపారేస్తూ సోషల్ మీడియాలో ఏకీపారేశారు.

సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం గరికపాటి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలా గరికపాటి పై ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేయవచ్చో అన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేశారు అభిమానులు.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ వివాదంపై.నాగబాబు, చోటా కె నాయుడు, అనంత శ్రీరామ్, రామ్ గోపాల్ వర్మ లాంటి సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు.హీరో మంచి విష్ణు తాజాగా నటించిన చిత్రం జిన్నా.

ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రబంధం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

"""/" / ఈ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న మంచు విష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ గరికపాటి వివాదం పై స్పందించారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.

ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ అయితే చిరంజీవి తో ఫోటో తీసుకోవడం అనేది ఫ్యాన్స్ కి ఒక సువర్ణావకాశం లాంటిది అని తెలిపారు విష్ణు.

చిరంజీవి గారు ఒక లెజెండ్, ఆయన దగ్గరకి ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోటో తీసుకుంటారు.

అది సహజ విషయం అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ అంత పెద్ద స్టార్స్ ఉండేటప్పుడు అభిమానులు ఉత్సాహంగా ఉంటారు.

ఆ సమయంలో అభిమానుల ఆత్రుతని ఎవరూ ఆపలేరు అని తెలిపాడు మంచు విష్ణు.

అయితే మంచు విష్ణు కూడా చిరంజీవికి మద్దతుగా మాట్లాడాడు.గరికపాటిని తిట్టకపోయినా కూడా వివాదంలో చిరంజీవి తప్పులేదు అంటూ చిరంజీవిని సమర్థించారు హీరో మంచు విష్ణు.

ప్రధాని మోడీకి పెళ్లి ఆహ్వానం అందించిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఫోటో వైరల్!