సన్నీలియోన్‌ ను చూపించి.. మంచు విష్ణు పెద్ద స్కెచ్‌ వేశాడే!

మంచు విష్ణు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాడు.ఆయన నటించిన గత చిత్రాలు అన్నీ కూడా తీవ్ర నిరాశ పరిచాయి.

కొన్ని సినిమాలు దారుణమైన డిజాస్టర్లు గా నిలిచి భారీ కమర్షియల్ ఫ్లాప్ లుగా అయ్యాయి.

ఆ సినిమాల వల్ల మంచు విష్ణు తీవ్రం గా ఆర్థిక నష్టం పొందాడు.

అయినా కూడా ఈ మంచు హీరో సినిమా లని చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.

ప్రస్తుతం ఈయన జిన్నా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది.టీజర్ విడుదల కార్యక్రమం లో సన్నిలియోన్ సందడి చేసింది.

ఈ సినిమాలో కీలక పాత్ర లో నటించిన సన్నీ లియోన్ ని ముందు ఉంచి సినిమా ని ప్రమోషన్ చేస్తున్నాడు.

సన్నీకి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్ కారణంగా సినిమా కు కావాల్సినంత బజ్ క్రియేట్ అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సన్నీలియోన్ ఉండడం సినిమా కు ఎంత ప్లస్ అవుతుందో కానీ ప్రమోషన్ విషయం లో చాలా ప్లస్ అవుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

పెద్ద ఎత్తున సినిమా కోసం ఖర్చు చేసిన మంచు విష్ణు పెద్దగా ఖర్చు చేయకుండానే సన్నీ లియోన్‌ ని ముందు ఉంచి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

మంచి విష్ణు సన్నీ లియోన్‌ ని చూపించి బిజినెస్ కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

టీజర్ విడుదల తర్వాత బజ్ క్రియేట్ అవ్వడం తో తన గత సినిమాల ఫ్లాప్ లను పక్కన పెట్టి ఈ సినిమా ను కాస్త ఎక్కువ మొత్తం కు అమ్మేందుకు మంచు విష్ణు ప్రయత్నిస్తున్నాడు అంటూ సమాచారం అందుతుంది.

మరి ఆయన ప్రయత్నం ఎంత వరకు సఫలం అవ్వనుందో చూడాలి.

మా నాన్న జీవించి ఉంటే బాగుండేది.. హీరో అజిత్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!