సలార్ సెంటిమెంట్ రిపీట్ కానుందా.. ఆ తేదీకి మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కానుందా?

ఈ ఏడాది పెద్ద సినిమాలకు అనుకూల పరిస్థితులు లేవని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి విడుదలవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది.

పుష్ప ది రూల్( Pushpa 2 ) వాయిదా పడదని బన్నీ సన్నిహితులు చెబుతున్నా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / సలార్( Salaar ) సెంటిమెంట్ ఈ ఏడాది రిపీట్ కానుందని కన్నప్ప డిసెంబర్ నెల 3వ వారంలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

గతేడాది సలార్ సినిమా డిసెంబర్ నెల 22వ తేదీన విడుదల కాగా ఈ ఏడాది ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించిన కన్నప్ప విడుదల కానుందని సమాచారం అందుతోంది.

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సలార్ సెంటిమెంట్ రిపీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

"""/" / కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా కన్నప్ప సినిమాతో విష్ణు, ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ పోషించిన పాత్రకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.కన్నప్ప బిజినెస్ పరంగా అదరగొడుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కన్నప్ప సినిమాతో విష్ణు సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కన్నప్ప సినిమాపై ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

కన్నప్ప సినిమా విష్ణు కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విష్ణు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కన్నప్ప సినిమాలో నటించడం మోహన్ లాల్ కి ఇష్టం లేదా..?