ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు జిన్నా… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మంచు విష్ణు హీరోగా మోసగాళ్లు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మంచు విష్ణు సన్నీలియోన్, పాయాల్ రాజు పుత్ హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఏవీఏ ఎంటర్‌టైన్‌ మెంట్‌, యూనివర్సల్‌ స్టూడియోలతో కలిసి 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై ప్రముఖ నటుడు మోహన్‌ బాబు నిర్మించిన ఈ సినిమా రొటీన్ కథాంశం ఉండటం వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు.

ఇలా తెలుగు తమిళ మలయాళ భాషలలో విడుదలైనటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇకపోతే ఈ సినిమా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పెద్దగా కలెక్షన్లను రాబట్టకపోయినా ఈ సినిమా హిందీ హక్కులు మాత్రం భారీ ధరలకు అమ్ముడు పోవడంతో మంచి లాభాలే వచ్చాయని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సమస్త అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కైవసం చేసుకుంది.

"""/"/ ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ థియేటర్లో విడుదలయి థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ అనగా గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది.

ఇలా థియేటర్లో పెద్దగా సక్సెస్ సాధించలేనటువంటి జిన్నా సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

ఐసీసీ అవార్డ్స్ లో దుమ్ములేపిన టీమిండియా ఆటగాళ్లు