జిన్నా డిజాస్టర్ అయినా మంచు విష్ణుకు అన్ని రూ.కోట్ల లాభం వచ్చిందా?
TeluguStop.com

మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన జిన్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఫస్ట్ వీకెండ్ వరకు కూడా ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదనే సంగతి తెలిసిందే.


మంచు విష్ణు సినీ కెరీర్ లోని డిజాస్టర్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.
తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు కోటి రూపాయల కంటే తక్కువ మొత్తం కాగా ఈ కలెక్షన్ల వల్ల విష్ణు నిర్మాతగా కూడా నష్టపోయారని కామెంట్లు వినిపించాయి.
అయితే ఈ సినిమా డబ్బింగ్ హక్కులు మాత్రం ఏకంగా 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ మొత్తానికే అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఓటీటీలో కచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ సినిమా వల్ల విష్ణుకు మూడు కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.
విష్ణు గత సినిమా మోసగాళ్లు హిందీ డబ్బింగ్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం.
హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మంచు విష్ణు తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు.
"""/"/
మంచు విష్ణు ఒక్కో ప్రాజెక్ట్ కు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అయితే బయటి నిర్మాతలతో సినిమాలను నిర్మించడం కంటే సొంతంగా సినిమాలను నిర్మించుకోవడానికి విష్ణు ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
విష్ణు తర్వాత సినిమా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
విష్ణు కెరీర్ విషయంలో మరింత సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
అకీరాను పరిచయం చేయబోతున్న వైజయంతి బ్యానర్స్…. డైరెక్టర్ ఎవరో తెలుసా?