జిన్నా సందడి చేసేలా ఉన్నాడే..!
TeluguStop.com
మంచు విష్ణు హీరోగా సూర్య డైరక్షన్ లో వస్తున్న సినిమా జిన్నా.కోనా వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటించారు.
మంచు విష్ణు మార్క్ కామెడీ మూవీగా వస్తున్న ఈ జిన్నా సినిమా అసలైతే దసరాకి రిలీజ్ కావాల్సి ఉన్నా గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాల మధ్య ఎందుకని పోటీ నుంచి తప్పుకున్నాడు.
ఇక ప్రస్తుతం అక్టోబర్ 21న మంచు విష్ణు జిన్నా రిలీజ్ డేట్ లాక్ చేశారు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంకా ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా సందడి చేసేలా ఉందనిపిస్తుందిఉ.
జిన్నా సినిమాతో మంచు విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.
సినిమాలో పాయల్, సన్నీ లియోన్ ల అందాలను హైలెట్ చేస్తూ రొమాంటిక్ ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చేలా చేస్తున్నారు.
జిన్నా సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మాత్రం మంచు బాబు కెరియర్ లో ఓ సూపర్ హిట్ పడినట్టే లెక్క.
జిన్నా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.జిన్నా సినిమా విషయంలో మంచు విష్ణు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అర్ధమవుతుంది.
వీడియో: నెటిజన్లను నవ్విస్తున్న ఎలాన్ మస్క్ రోబో.. తడబడుతూనే నడక నేర్చుకుంటోందిగా..?