మహేష్ బాబు అందం వెనుక సీక్రెట్ ఇదేనంట..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 45 సంవత్సరాల వయస్సులో కూడా యంగ్ గానే కనిపిస్తున్నారు.

చాలామంది హీరోయిన్లు మహేష్ అందానికి ఫిదా అయ్యామని ఇంటర్వ్యూల్లో చెప్పారు.వయస్సు పెరిగే కొద్దీ మహేష్ అందం రెట్టింపవుతూ ఉండటం గమనార్హం.

సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా సినీ ప్రముఖులు సైతం మహేష్ బాబు మంచితనాన్ని ప్రశంసించడంతో పాటు మహేష్ ను ఇష్టపడతామని పలు సందర్భాల్లో చెప్పారు.

తాజాగా మహేష్ బాబు, నమ్రత మంచు విష్ణు భార్య వెరోనికా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

వెరోనికా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విష్ణు ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి వయస్సు పెరుగుతున్నా యువకుడిలా మారుతూ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడని పేర్కొన్నారు.

"""/"/ ఆయన మంచితనం వల్లే ఇంత అందంగా కనిపిస్తున్నాడని తాను బలంగా నమ్ముతున్నానని విష్ణు చెప్పుకొచ్చారు.

మంచు విష్ణు పోస్ట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ ఇంత మంచి ఆతిధ్యమిచ్చినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

మహేష్ బాబు అందం వెనుక సీక్రెట్ మంచితనమే అని మంచు విష్ణు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నారు.గీతాగోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కీర్తిస్తురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.మరోవైపు మహేష్ బాబు గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారు.

ఇప్పటివరకు 1,020 మంచి చిన్నారుల ప్రాణాలను మహేష్ కాపాడారు.తాజాగా షేక్ రిహాన్ అనే వ్యక్తి ట్రయాలజీ హార్ట్ సర్జరీతో క్షేమంగా బయటపడ్డారని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. సీఎం జగన్ హాట్ కామెంట్స్