ఇది కేవలం మంచు వారి కన్నప్ప మాత్రమే.. ఎవరు రాసిన చరిత్ర… ఎక్కడ దొరికిన చరిత్ర ?
TeluguStop.com
మంచు విష్ణు ( Manchu Vishnu ) చాలా రోజులుగా ఒక్క హిట్టు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా భక్త కన్నప్ప( Bhaktha Kannappa ) పేరుతో ఓ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు.
అలాగే మోహన్ బాబు( Mohan Babu ) మాట్లాడుతూ ఇది భక్త కన్నప్ప స్టోరీ కాదు ఒక చరిత్ర అంటూ ఏదో చెప్పేశాడు.
చరిత్ర అంటే కచ్చితంగా ఇదివరకే జరిగినది మరి ఈ కన్నప్ప స్టోరీ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది? ఎవరి చేత రాయబడింది ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే ఇది రూపొందుతుంది అనే విషయాలకు మోహన్ బాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
సినిమా టీజర్ చూసిన తర్వాత సగటు ప్రేక్షకుడికి ఈ చిత్రంపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి.
"""/" /
ఇది భక్త కన్నప్ప సినిమా లాగా లేదు.రాజమౌళిని ఆదర్శంగా తీసుకొని ఆర్ఆర్ఆర్ సినిమాలో( RRR ) రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొమరం భీమ్ అలాగే అల్లూరి పాత్రలను ఎలా అయితే కిచిడి చేశారో మంచు విష్ణు కూడా ఇప్పుడు భక్త కన్నప్పను కిచిడి చేసినట్టుగా కనిపిస్తుంది.
గుట్టలుగా శవాలు అలాగే సగటు తెలుగు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.
ఒక దేవుడిపై లేదా ఒక భక్తుడి పై తీసే సినిమా లాగా ఇది కనిపించడం లేదు పూర్తిస్థాయి ఫారం లొకేషన్స్ లో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అంటే అది అనుమానమే.
"""/" /
సినిమాలు అవసరం ఉన్నా లేకున్నా పాన్ ఇండియా( Pan India ) కాన్సెప్ట్ కాబట్టి రకరకాల భాషల్లోని స్టార్ హీరోస్ ని పెట్టుకుని సినిమాని పూర్తిస్థాయిలో మార్చేసినట్టుగానే కనిపిస్తుంది.
ఒకవేళ అవుట్ ఫుట్ బాగొచ్చి ప్రేక్షకులు మెచ్చుకుంటే వందల కోట్ల కలెక్షన్స్ అయినా ఇస్తారు కానీ అటు ఇటు అయితే ఆల్మోస్ట్ మంచు విష్ణు ఇక జీరో అయిపోవడం ఖాయం.
నిజానికి ఇప్పటికే కన్నప్ప పేరుతో బాపు కృష్ణంరాజు తో( Krishnam Raju ) సినిమా తీశాడు.
"""/" / ఇందులో కన్నప్పకి ప్రేయసిని పెట్టి కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి దర్శకత్వం చేసిన బాపు ( Bapu ) ఎంతో కొంత లిబర్టీ తీసుకున్న కూడా ప్రేక్షకులను కన్విన్స్ చేశాడు.
కానీ మంచు విష్ణు మాత్రం తన డైలాగ్ డెలివరీతోనే కనెక్ట్ కాలేకపోతున్నాడు మరి సినిమా పూర్తిగా ఎలా ఉందో తెలిస్తే తప్ప దాని పరిస్థితి ఏంటో అర్థం కాదు.
ఏది ఏమైనా సినిమా అన్న బాగుండాలి, విజయం అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.అందులో మేము కూడా ఉన్నాము.
అకీరా నందన్ వర్సెస్ గౌతమ్.. టాలీవుడ్ సూపర్ స్టార్ అనిపించుకునే హీరో ఎవరో?