ఢీ సీక్వెల్ ఉంటుంది అంటున్న విష్ణు... శ్రీనువైట్ల ఖుషి

వరుస హిట్స్ తో స్టార్ దర్శకుడుగా ఎదిగి అంతే వేగంగా వరుస ఫ్లాప్ లతో క్రిందికి పడిపోయిన దర్శకుడు శ్రీనువైట్ల.

కామెడీ కంటెంట్ ని నమ్ముకొని స్టార్ కమెడియన్స్ తో ఒక కామెడీ ట్రాక్, దానికి ఆనుకొని హీరోతో కూడా కామెడీ చేయించి హిట్స్ కొట్టిన శ్రీనువైట్ల తర్వాత ఒకే మూసలో కథలు తయారు చేసుకొని వెళ్ళడంతో ప్రేక్షకులు తిరస్కరించారు.

దీంతో ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు.ఒకప్పుడు పిలిచి మరీ డేట్స్ ఇచ్చిన స్టార్ హీరోలు ఇప్పుడు శ్రీనువైట్లని పూర్తిగా పక్కన పెట్టేసారు.

అయితే ఈ దర్శకుడు మాత్రం మళ్ళీ పాత కథలని ఏదో కొత్తదనం ఉన్నట్లు చెప్పడానికి హీరోల చుట్టూ తిరుగుతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.

ఇలాంటి టైంలో శ్రీనువైట్లకి ఊహించని విధంగా మంచు విష్ణు రూపంలో అవకాశం వచ్చినట్లే కనిపిస్తుంది.

బ్లాక్ బస్టర్ మూవీ ఢీ సీక్వెల్ తీస్తామని, దీనికి సంబంధించిన విషయాలు శ్రీను వైట్ల వెల్లడిస్తారని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు తెలిపారు.

ఈ నేపధ్యంలో త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.అయితే ఢీ తర్వాత అదే జోనర్ తో శ్రీనువైట్లతో పాటు చాలా మంది కథలు వండి వార్చారు.

ఇప్పుడు విలన్ ని మోసం చేసి కమెడియన్ తో ఆడుకునే కంటెంట్ ని ప్రేక్షకులు తిరస్కరించారు.

ఈ నేపధ్యంలో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.మరి ఇప్పుడు వీరిద్దరు కలిసి ఈ సీక్వెల్ తో ఎలాంటి కథని చెబుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గేమ్ ఛేంజర్ మూవీకి ఆ రెండు సీన్స్ హైలెట్ కానున్నాయా.. ఫ్యాన్స్ కు పూనకాలే!