మంచు వారి అబ్బాయిలు పోటీ పడి మరీ తండ్రికి బర్త్‌డే కానుకలు ఇచ్చారు... నిజంగా అభినందనీయం

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి చాలా ప్రముఖ స్థానం ఉంటుంది.మోహన్‌బాబు 550 సినిమాలకు పైగా నటించి గ్రేట్‌ అనిపించుకున్నాడు.

ఆయన వారసులుగా మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌లు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే.

ఇండస్ట్రీలో వీరు తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ సమయంలోనే మంచు ఫ్యామిలీకి చెందిన వారు సమాజ సేవ చేయడంలో ముందు ఉంటున్నారు.

ముఖ్యంగా మంచు మనోజ్‌ ఎప్పుడు కూడా ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ మంచి మనసును చాటుకుంటూ ఉన్నాడు.

తాజాగా ఆయన తండ్రి మోహన్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఒక పాపను దత్తత తీసుకుని ఆ పాప చదువుకు పూర్తి బాధ్యత తానే వహిస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.

తిరుపతిలోని తమ స్కూల్‌లో ఆ పాపను చదివించబోతున్నట్లుగా మనోజ్‌ ప్రకటించాడు.మనోజ్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మంచు విష్ణు ఏకంగా కోటి రూపాయల విరాళంను ప్రకటించాడు.

తిరుపతిలోని రుయా హాస్పిటల్‌లో మౌళిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కోటి రూపాయలతో ఐసీయూ మరియు మెడికల్‌ వార్డ్‌లను ఆధునీకరించడంతో పాటు, మెరుగైన వైధ్యం అందేలా ఏర్పాట్లు చేస్తానంటూ మంచు విష్ణు ప్రకటించాడు.

అన్న తమ్ముడు పోటా పోటీగా ఇలా సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

ముఖ్యంగా కోటి రూపాయలు ఇచ్చేందుకు మంచు విష్ణు రావడంను అభినందిస్తున్నారు.కోటి రూపాయల విరాళంలో భాగంగా మొదటి విడత నిన్ననే చెక్‌ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది.

రుయా హాస్పిటల్‌ ఐసీయూ ఆధునీకరణలో భాగంగా మంచు మోహన్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా నిన్న ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

మొత్తానికి మంచు వారి ఫ్యామిలీ ఇలా చేయడం అభినందనీయం.

శంషాబాద్ ఎయిర్‎పోర్టు ఏరియాలో చిరుత .. పట్టుకునేందుకు అధికారుల తంటాలు