మోహన్ బాబు పై పరోక్షంగా కామెంట్స్ చేసిన చిరు.. స్పందించిన మనోజ్?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటుడు మోహన్ బాబు ( Mohan Babu ) మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వారు జరుగుతుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా మరోసారి పరోక్షంగా మోహన్ బాబు గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు( ANR ) శత జయంతి వేడుకలను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందజేశారు.
"""/" /
ఈ అవార్డు అందుకున్న అనంతరం చిరంజీవి వజ్రోత్సవ వేడుకలలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.
వజ్రోత్సవ వేడుకలలో భాగంగా లెజెండరీ అవార్డు చిరంజీవికి రావడంతో ఆ అవార్డుకు ఆయన అర్హుడు కాదంటూ కొంతమంది హీరోలు చిరంజీవికి ఈ అవార్డును ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఆ సమయంలో చిరంజీవి ఆ అవార్డును పక్కనపెట్టి ఈ అవార్డుకు నేను అర్హుడు అయినప్పుడు మాత్రమే తీసుకుంటానని తెలిపినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
"""/" /
ఇక్కడ చిరంజీవి మోహన్ బాబు పేరు ప్రస్తావించకపోయిన అప్పట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసింది మోహన్ బాబు కావడంతో మరోసారి వీరి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మంచు మనోజ్ ఈ వార్తలపై స్పందించారు.
ఇక ఈ విషయం గురించి మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తెలుగు జనాలకు, తెలుగు మీడియాకి దశాబ్దాలుగా తెగ నచ్చేసిన ఫెవరెట్ కార్టూన్ అంటూ టామ్ అండ్ జెర్రీ వీడియోలను షేర్ చేశాడు.
చిరంజీవి మోహన్ బాబు ఇద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటివారని వారు కొట్టుకున్న తిరిగి మరి కలిసిపోతారనే ఉద్దేశంతోనే మనోజ్ ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది.
బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!