పుష్ప సినిమాలో మంచు హీరో.. అలాంటి పాత్రలో..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

రష్మిక మందన్న ఈ సినిమలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

యంగ్ హీరో మంచు మనోజ్ పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

వాస్తవానికి పుష్ప సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే కరోనా వల్ల పుష్ప షెడ్యూల్స్ మారడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

విజయ్ సేతుపతికి నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రను సుకుమార్ ఆఫర్ చేయగా ఆ పాత్రలో ఇప్పుడు మంచు మనోజ్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.

"""/"/ గతంలో మంచు మనోజ్, అల్లు అర్జున్ వేదం సినిమాలో నటించారు.మంచు మనోజ్ పుష్ప సినిమాలో నటిస్తే మాత్రం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

రష్మిక మందన్న ఈ సినిమాలో గిరిజన యువతి పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది.సుకుమార్ దేవి శ్రీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజికల్ హిట్ కూడా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో దిశా పటానీ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చినా ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఊర్వశి రౌటెలాను ఈ పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది ఆగష్టు నెల 13వ తేదీన పుష్ప సినిమా విడుదల కానుంది.

సినిమా ఇండస్ట్రీ లో మెగా హీరోల పరిస్థితి ఏంటి..?