స్టార్ట్ అయిన మంచు మనోజ్ కొత్త సినిమా షూటింగ్…
TeluguStop.com
రీసెంట్ గా మంచు మనోజ్( Manchu Manoj ) ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
అయితే పొలిటికల్ సెటైరికల్ గా ఉండే ఒక సినిమా చేయడానికి ఈయన చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా కి తమిళ్ డైరెక్టర్ గా( Tamil Director ) ఉన్న ఒక వ్యక్తి డైరెక్షన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది నిజానికి ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం పక్కనపెడితే మనోజ్ సినిమా చేసి దాదాపు ఒక 6 సంవత్సరాలు గడిచిపోయింది ఇక దానికి తోడు ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తాడా రాజకీయాలు చేస్తాడా అనేది చూడాలి.
"""/" /
ఇక ఈయన ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే.
అయితే ఆయన ఇప్పుడు పొలిటికల్ సెటైరికల్ సినిమాని తీసి ఎలక్షన్స్ కి ముందే ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు ఇక ఈ సినిమా ద్వారా ఫెమ్ సంపాదించి రాజకీయాల్లోకి( Politics ) పూర్తి స్థాయి లో అడుగుపెడుదాం అని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈయన కనక ఈ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ కొడితే మళ్ళీ ఇండస్ట్రీ లో తనకంటూ ఇంతకు ముందు ఉన్న రాక్ స్టార్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకోవచ్చు అనే చెప్పాలి.
"""/" /
అయితే ఈయన ఇంతకు ముందు మోహన్ బాబు కొడుకు గా( Mohan Babu ) ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన కూడా ఆయన కి ఇక్కడ చెప్పుకోదగ్గట్టుగా హిట్లు అయితే ఏమి పడలేదనే చెప్పాలి.
అందుకే ఆయన కొన్ని రోజులు గా ఇండస్ట్రీ కి దూరం ఉంటున్నారు ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ మనోజ్ తన కెరియర్ ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు గా తెలుస్తుంది.
ఇక ఇదే నిజం అయితే మనోజ్ ఇక స్క్రీన్ మీద మనకు హీరో గా కనిపిస్తాడు అనే చెప్పాలి.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు తత్వం బోధపడిందా.. ఇకనైనా ఆ ఒక్క విషయంలో మారతారా?