మంచు ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం తెచ్చిన మనోజ్..!

మంచు ఫ్యామిలీలో కొత్త ఉస్తాహం తీసుకొచ్చాడు మంచు మనోజ్.ఎందుకంటే చాలా రోజులుగా తన లుక్ విషయంలో ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్న మంచు మనోజ్ ఫైనల్ గా తన స్లిం లుక్ తో సిద్ధం అయ్యాడు.

ఐదేళ్ల క్రితం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని మార్పులు చేసుకున్న మంచు మనోజ్.

ఫైనల్ గా తన లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ కి ఊపునిచ్చాడు.అయితే డైరెక్ట్ లుక్ రివీల్ చేయకుండా ఒక పోస్టర్ తరహాలో లుక్ వదిలాడు.

కెరీర్ మొదట్లో స్టార్ మెటీరియల్ అనిపించిన మంచు మనోజ్ తర్వాత ఎందుకో వెనకపడ్డాడు.

మంచు ఫ్యామిలీ హీరోల్లో మనోజ్ మీదే అన్ని అంచనాలు పెట్టుకున్నారు మంచు ఫ్యాన్స్.

ఎందుకంటే మంచు విష్ణు సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.అందుకే మంచు ఫ్యామిలీని కాపాడేది మనోజ్ మాత్రమే అని వారి ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గ్యాప్ ఎంత వచ్చినా సరే సరైన కంటెంట్ తో మంచు మనోజ్ వస్తే మాత్రం మంచి హిట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రేక్షకులు.

విశాల్ పై ఆరోపణలు చేసిన యూట్యూబర్లపై కేసు.. ఆ నిర్ణయంతో భారీ షాక్ తగిలిందిగా!