న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు.. మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో మంచు మనోజ్ ఒకరు కాగా ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా మంచు మనోజ్ పేరు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

మంచు మనోజ్ తాజాగా రంగారెడ్డి జిల్లా (Manchu Manoj, Rangareddy District)అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh)ను కలిశారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ మాకు ఆస్తి తగాదాలు లేవని మా విద్యా సంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

నేను విద్యార్థుల కోసం మాత్రమే పోరాడుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఇది అంతా మా నాన్నను అడ్డు పెట్టుకుని మా అన్న ఆడుతున్న నాటకమని మనోజ్ వెల్లడించారు.

విద్యార్థులు, ఫ్యామిలీ, బంధువుల(Students, Family, Relatives) కోసమే నా పోరాటమని ఆయన అన్నారు.

న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదని మంచు మనోజ్ వెల్లడించారు.మంచు మనోజ్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

"""/" / న్యాయం కోసం నేను పోరాడుతున్నానని నేను మెజిస్ట్రేట్ కు సైతం ఇదే విషయాన్ని చెప్పానని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు మెజిస్ట్రేట్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్ కు నోటీసులు జారీ అయ్యాయని సమాచారం అందుతోంది.

మోహన్ బాబు ఫిర్యాదు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. """/" / మంచు మనోజ్(Manchu Manoj) ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.

ఆ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ అధికారికంగా రావడం లేదనే సంగతి తెలిసిందే.

మంచు ఫ్యామిలీ వివాదం విషయంలో సినీ పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మంచు ఫ్యామిలీ వివాదంలో జరుగుతున్న ఘటనల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మనోజ్ భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?