మిస్టర్ నూకయ్య హీరోయిన్ కి రియల్ లైఫ్ లో అదే కథ రిపీట్... క్యారెక్టర్ చేంజ్ అంతే

సనఖాన్ అంటే టాలీవుడ్ లో ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు.కళ్యాణ్ రామ్ కత్తి, మిస్టర్ నూకయ్య సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అంటే అందరికి పరిచయం అవుతుంది.

తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన ఈ భామకి అనుకున్న స్థాయిలో గుర్తింపు, అవకాశాలు రాలేదు.

దాంతో ముంబై చెక్కేసి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నం చేసి ఒక బి గ్రేడ్ సినిమాలో నటించి హద్దులు లేకుండా అందాల ప్రదర్శన చేసింది.

అయిన అక్కడ కూడా ఆమెని ఎవరు పట్టించుకోలేదు.దీంతో లైఫ్ లో సెటిల్ అయిపోవాలని భావించి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో పరిచయం అయ్యి అతడి ప్రేమలో పడిపోయింది.

ఇద్దరు పీకల్లోతు ప్రేమలో పడి కొంత కాలం డేటింగ్ లో ఉన్నారు.తామిద్దరం ఒకరికోసం ఒకరం పుట్టాం అనే విధంగా పలు ఇంటర్వ్యూలలో ప్రేమికుడుని ఆకాశానికి ఎత్తేసింది.

అయితే ఊహించని విధంగా కథ మొత్తం మారిపోయింది.తాను నటించిన మిస్టర్ నూకయ్య స్టొరీ ఆమె లైఫ్ లో రిపీట్ అయ్యింది.

ఈ భామని ప్రేమించిన వ్యక్తి మెల్విన్ దారుణంగా మోసం చేసాడంట.తాజాగా మీడియా ముందుకు వచ్చిన సనా అతడి గురించి సంచలన విషయాలను బయట పెట్టింది.

మెల్విన్ కు చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి.ఆ విషయం నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే తెలిసింది.

అతడు నన్ను దారుణంగా మోసం చేశాడు.అతడి కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయి జీవితంలో చాలా నష్టపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అతన్ని నేను ఎంతో ప్రేమించా కాని నన్ను చాలా ఈజీగా మోసం చేసాడు.

నన్ను ప్రేమిస్తూనే ఇతర అమ్మాయిలతో బెడ్ రిలేషన్ లో ఉన్నవాడిని ఏమనాలో నాకు అర్ధం కావడం లేదు అంటూ తన ఆవేదన మొత్తం మీడియాతో పంచుకుంది.

జాగ్రత్త సుమీ.. గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే!